Ash Barty Wins Australian Open-2022
Singles Tennis Title, Ending 44-Year Title Drought for Australian Women
ఆస్ట్రేలియన్ ఓపెన్-2022 విజేత యాష్లే బార్టీ - 44
ఏళ్ల రికార్డు బద్దలు
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల
సింగిల్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే బార్టీ విజేతగా నిలిచింది. శనివారం
జరిగిన తుదిపోరులో ఆమె అమెరికాకు చెందిన డానియెలీ రోజ్ కొలిన్స్‌ను ఓడించింది. 6-3, 7-6 పాయింట్లతో వరుస సెట్లలో విజయం సాధించింది. రెంటో సెట్లో ఓ దశలో 1-5 తో వెనుకబడిపోయిన బార్టీ గొప్పగా పుంజుకుంది. కొలిన్స్ చేసిన అనవసర
తప్పిదాలను సద్వినియోగం చేసుకుంది. వరుసగా రెండు బ్రేక్ పాయింట్లు సాధించి
పోటీలోకి వచ్చింది. దీంతో తన కెరీర్లో తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్
సాధించింది. దీంతో సంచలన ప్రదర్శనతో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరిన
అమెరికా అమ్మాయి డానియెలీ కొలిన్స్‌కి తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నిరాశే
ఎదురైంది. ఇంతకు ముందు బార్టీ రెండు గ్రాండ్‌స్లామ్‌లు (2021
వింబుల్డన్, 2019 ఫ్రెంచ్ ఓపెన్) నెగ్గినా.. తన స్వదేశంలో
జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను సొంతం చేసుకోవడం మాత్రం ఇదే తొలిసారి.
తొలి సెట్‌ను 6-3తో సొంతం చేసుకున్న బార్టీ.. రెండో సెట్‌లో కొలిన్స్ నుంచి గట్టిపోటీ
ఎదురైంది. రెండో సెట్ 6-6తో టై బ్రేక్‌కు దారి తీసింది.
అయితే సెట్ చివరి గేమ్‌లో ఫుంజుకున్న బార్టీ మొత్తంగా 7-6(7-2)తో రెండోసెట్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన బార్టీ మెయిడెన్
ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.మ్యాచ్‌లో బార్టీ 10 ఏస్‌లు సందించి.. మూడు డబుల్ ఫాల్ట్‌లు నమోదు చేయగా.. కొలిన్స్ ఒక ఏస్
సందించి.. రెండు డబుల్‌ఫాల్ట్‌లు చేసింది.
ఇక 25 ఏళ్ల యాష్లే
బార్టీ 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో
వింబుల్డన్‌ను గెలుచుకుంది. తాజాగా సాధించిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
బార్టీ కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ కావడం విశేషం. ఇక యూఎస్ ఓపెన్ ఒక్కటి
గెలిస్తే యాష్లే బార్టీ కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసుకోనుంది. ఈ విజయంతో
బార్టీ 44 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. సొంతగడ్డపై
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సాధించిన రెండో ఆస్ట్రేలియన్ మహిళా ప్లేయర్‌గా
బార్టీ చరిత్ర సృష్టించింది. ఇంతకముందు 1978లో క్రిస్ ఓనిల్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి ఆస్ట్రేలియన్ వుమెన్‌గా నిలిచింది.
Made Down Under ™️🇦🇺@ashbarty • #AusOpen • #AO2022 pic.twitter.com/9zAY1GKD3w
— #AusOpen (@AustralianOpen) January 29, 2022
0 Komentar