Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BEL Recruitment 2022 – Apply for 247 Posts - Project Engineers, Trainee Engineers and Trainee Officers

 

BEL Recruitment 2022 – Apply for 247 Posts - Project Engineers, Trainee Engineers and Trainee Officers

బెల్, బెంగళూరులో 247 పోస్టులు - ప్రాజెక్ట్ ఇంజినీర్లు, ట్రెయినీ ఇంజినీర్లు మరియు ట్రెయినీ ఆఫీసర్ల ఖాళీలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 247

1) ప్రాజెక్ట్ ఇంజినీర్లు: 67

విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 01.01.2022 నాటికి 32 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: మొదటి ఏడాది నెలకి రూ.40,000, రెండో ఏడాది నెలకి రూ.45,000, మూడో ఏడాది నెలకి రూ.50,000, నాలుగో ఏడాది నెలకి రూ.55,000 చెల్లిస్తారు.

2) ట్రెయినీ ఇంజినీర్లు: 169

విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్చర్.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్)/ బీఆర్క్ (ఐదేళ్లు) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి.

వయసు: 01.01.2022 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: మొదటి ఏడాది నెలకి రూ.30,000, రెండో ఏడాది నెలకి రూ.35,000, మూడో ఏడాది నెలకి రూ.40,000.

3) ట్రెయినీ ఆఫీసర్లు (ఫైనాన్స్): 11

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఫైనాన్స్ స్పెషలైజేషన్ తో ఎంబీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి.

వయసు: 01.01.2022 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: మొదటి ఏడాది నెలకి రూ.30,000, రెండో ఏడాది నెలకి రూ.35,000, మూడో ఏడాది నెలకి రూ.40,000.

ఎంపిక విధానం: బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ ఎంబీఏలో సాధించిన మెరిట్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.02.2022.

NOTIFICATION

APPLY HERE

PAYMENT PAGE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags