Booster Doses for Frontline Workers,
Seniors Begin Today (Jan 10)
దేశ వ్యాప్తంగా ‘ప్రికాషన్’ డోసు
ప్రారంభం - ఫ్రంట్‌లైన్ వర్కర్లు మరియు 60+ వారికి టీకా – తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవే
దేశ వ్యాప్తంగా ముందుజాగ్రత్త చర్యగా సోమవారం (జనవరి 10) నుంచి ‘ప్రికాషన్’ డోసును ప్రారంభించనున్నారు. మహమ్మారి నివారణకు ముందువరుసలో నిలుచొని పోరాటం సాగిస్తున్న వైద్యారోగ్య సిబ్బంది, కార్యకర్తలు (కొవిడ్ యోధులు), 60 ఏళ్లు పైబడి ఇతర వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నవారికి ప్రాధాన్యమిస్తూ ఈ డోసు వేస్తారు. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపుర్, గోవా రాష్ట్రాల్లో పోలింగు విధులు నిర్వహించే సిబ్బందిని కూడా ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా పరిగణిస్తారు. కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదివారం ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ.. కోటి మందికిపైగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, సీనియర్ సిటిజన్లకు ‘ప్రికాషన్’ డోసుల విషయాన్ని గుర్తుచేస్తూ సంక్షిప్త సందేశాలు పంపినట్లు తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అంచనాల మేరకు.. 1.05 కోట్ల ఆరోగ్య కార్యకర్తలు, 1.9 కోట్ల ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 2.75 కోట్ల సీనియర్ సిటిజన్లు ఈ అదనపు డోసును పొందనున్నారు.
* మిక్స్‌డ్ వ్యాక్సినేషను
ఉండదని, లబ్ధిదారులు గతంలో ఏవైతే రెండు డోసులు తీసుకున్నారో
‘ప్రికాషన్’ డోసు కింద కూడా అవే టీకాలను ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల
ప్రకారం.. రెండో డోసుకు, ‘ప్రికాషన్’ డోసుకు మధ్య గడువు 9 నెలలు (39 వారాలు) ఉండాలి.
* అర్హులందరినీ అప్రమత్తం
చేస్తూ కొవిన్ పోర్టల్ నుంచి రిమైండర్ సందేశాలు వస్తాయి. టీకా ఇచ్చాక డిజిటల్
వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో ఆ మేరకు నమోదు చేస్తారు. ‘ప్రికాషన్’ డోసుకు
శనివారం సాయంత్రం నుంచే కొవిన్ పోర్టల్‌లో ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్లు
మొదలయ్యాయి. జనవరి 10 నుంచి ఆన్‌సైట్ అపాయింట్‌మెంట్
అవకాశం కూడా ఉంటుంది.
* కొవిడ్-19 వ్యాక్సినేషన్ కేంద్రాలుగా వ్యవహరిస్తున్న ప్రయివేటు ఆసుపత్రులు సైతం తమ
సిబ్బందిలో అర్హులైనవారికి ‘ప్రికాషన్’ డోసు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
సూచించింది. 60 ఏళ్లు పైబడి ఇతర వ్యాధులతో ఇబ్బందులు
పడుతున్నవారు ‘ప్రికాషన్’ డోసు కోసం వైద్యుల ధ్రువీకరణ పత్రాలు చూపాల్సిన అవసరం
లేదు.
0 Komentar