Covid-19 States Updates:
Tamil Nadu Sunday Lockdown, Close Schools - Weekend Curfew
in Karnataka from Friday
కర్ణాటక వారాంతపు కర్ఫ్యూ అప్డేట్:
10, 12 తరగతులకు మినహాయింపు - - కఠిన ఆంక్షలతో ప్రత్యేక గైడ్‌లైన్స్ జారీ -మరింత పెరిగిన కరోనా, ఒమైక్రాన్ కేసులు
రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన అధికార నివాసం కృష్ణలో ఆరోగ్యశాఖ నిపుణులు, ఉన్నతాధికారులు, మంత్రులతో మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. 3 గంటలకుపైగా ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం రెవెన్యూశాఖ మంత్రి అశోక్, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ మీడియాతో మాట్లాడారు.
శుక్రవారం రాత్రి నుంచే బెంగళూరు నగరంలో కఠిన ఆంక్షలు
ప్రారంభమవుతాయన్నారు. రెండు వారాలపాటు ఈ ఆంక్షలు కొనసాగిస్తామన్నారు. రాజధాని
బెంగళూరులో వారాంతపు కర్ఫ్యూ విధించాలని తీర్మానించామన్నారు.
నిత్యావసర వస్తువులు, అత్యవసర
సేవలు మినహా మిగిలినవాటికి అనుమతులు ఉండవన్నారు. వీకెండ్ కర్ఫ్యూ శుక్రవారం
రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 6 వరకు కొనసాగుతుందన్నారు. కాగా మాల్స్, థియేటర్లు,
పబ్‌లు, హోటళ్లు, బార్లలో
50 శాతం సీట్లకే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. జాతరలు,
బహిరంగ సభలు, ర్యాలీలు, అన్ని
రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం నుంచి 10,
12 తరగతులు మినహా మిగిలిన అన్ని తరగతుల విద్యాసంస్థలను
రెండువారాలపాటు మూసివేయాలని నిర్ణయించామన్నారు.
తమిళనాడులో లాక్‌డౌన్ అప్డేట్:
తమిళనాడు రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విశ్వరూపం చూపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య కూడా నిత్యం పెరుగుతుండటంతో స్టాలిన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మళ్లీ లాక్‌డౌన్ నిబంధనల్ని అమల్లోకి తీసుకుని వచ్చింది.
ఆదివారం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధిస్తూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు పెరిగిన వేళ అత్యవసరంగా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేసిన సీఎం స్టాలిన్ రాష్ట్రంలోని పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హెల్త్ మినిస్టర్ సుబ్రమణియన్.. హెల్త్ సెక్రెటరీ రాధా కృష్ణన్ కూడా హాజరయ్యారు. సినిమా థియేటర్లు, మెట్రోరైళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, జిమ్‌లలోకి కేవలం 50 శాతం మందిని మాత్రమే అనుమతించేలా నిబంధనలు తీసుకుని వచ్చారు.
ఆలయాలు, చర్చిలు,
మసీదులు, ఇతర ప్రార్థనాలయాలకు భక్తులను
అనుమతిస్తారు. వివాహాది శుభకార్యాలకు 100 మందికి..
అంత్యక్రియలకు 50 మందే హాజరవ్వాలి. రాష్ట్రంలో లేటెస్ట్‌గా 2వేల 731కేసులు వచ్చాయి. ఈ క్రమంలో స్టాలిన్
ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది.
0 Komentar