CoWIN Registrations for 15-18 Years Started
for Vaccines from Today (January 1) – Details Here
15-18 ఏళ్ల వారికి టీకా
రిజిస్ట్రేషన్లు ప్రారంభం - విద్యాసంస్థల ఐడీ కార్డులతోనూ అవకాశం – రిజిస్ట్రేషన్
ప్రక్రియ వివరాలు ఇవే
దేశంలో 15-18 ఏళ్ల వారికి కరోనా టీకాలు అందించేందుకు కేంద్రం ప్రక్రియ మొదలు
పెట్టింది. ఇందుకోసం నూతన సంవత్సరం(జనవరి 1) నుంచి పిల్లలకు
కొవిన్ యాప్/వెబ్ సైట్లో టీకా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది. జనవరి 3వ తేదీ నుంచి డోసుల పంపిణీ చేపట్టనున్నారు. మరి పిల్లలకు టీకా కోసం ఎలా
నమోదు చేసుకోవాలి అంటే .
గతంలో పెద్దల కోసం కొవిన్ యాప్లో
రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నారో.. పిల్లలకు కూడా అలాగే చేసుకోవాలి. అయితే
కుటుంబసభ్యుల ఫోన్ నంబరుతో లాగిన్ అయి నమోదు చేసుకోవచ్చు లేదా సెపరేట్ గా కూడా
రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉంది. లేదంటే సమీప వ్యాక్సినేషన్ కేంద్రానికి
వెళ్లి కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. అయితే వాక్-ఇన్ రిజిస్ట్రేషన్ రాష్ట్రాల
నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.
15 ఏళ్లు లేదా అంత కంటే
ఎక్కువ వయస్సు గల వ్యక్తులకు (2007లో లేదా అంతకంటే ముందు
పుట్టిన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..
* కొవిన్ యాప్ లేదా వెబ్
సైట్ లోకి వెళ్లి ఫోన్ నంబరును ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఫోను ఓటీపీ వస్తుంది. ఆ
ఓటీపీతో మీ నంబరును వెరిఫై చేయాలి.
* ఒక మొబైల్ నంబరు పై
నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. (ఉదాహరణకు, గతంలో
తల్లిదండ్రులిద్దరూ కొవిన్ యాప్లో రిజిస్టరైన నంబరుతో వారి పిల్లల(15-18 ఏళ్ల మధ్య వారైతేనే) పేర్లు కూడా నమోదు చేసుకోవచ్చు.)
* నంబరు వెరిఫై అయిన తర్వాత
రిజిస్ట్రేషన్ పేజీ వస్తుంది. అందులో పేరు, పుట్టినతేదీ,
లింగం వంటి వివరాలను ఎంటర్ చేయాలి.
* పిల్లలకు పాన్ కార్డు,
ఓటర్ ఐడీ వంటివి ఉండవు కాబట్టి.. ఐడీ ప్రూఫ్ ఆధార్ నంబరును
ఎంచుకోవాలి. ఒకవేళ ఆధార్ నంబరు ఇంకా తీసుకోని పిల్లలకు వారి స్టూడెంట్ ఐడీ నంబరును
నమోదు చేయవచ్చు.
* ఈ వివరాలన్నీ ఇచ్చిన
తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ బటన్ కన్పిస్తుంది. ఆ బటన్
క్లిక్ చేసి వ్యాక్సినేషను స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 15-18 ఏళ్ల వారికి కొవార్టిస్ టీకా ఒకటే అందుబాటులో ఉంది.
REFERENCES 👇
AP
– COVID-19 Vaccination Drive – Precaution dose –
Instructions and Guidelines
Boosters
For 60+, Frontline Staff; Vaccines For 15-18, Says PM
0 Komentar