ICICI Bank hikes credit card charges
with effect from February 10
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఛార్జీల
పెంపు –
పెరిగిన చార్జీల వివరాలు ఇవే
క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఛార్జీలను ఐసీఐసీఐ బ్యాంకు సవరించింది. పెంచిన ఛార్జీలను ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు ఇప్పటికే వినియోగదారులకు ఆ బ్యాంకు సందేశాలు పంపిస్తోంది. ఇకపై క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం కేంద్రాల నుంచి నగదు తీసినా, ఆలస్యంగా బిల్లు మొత్తం చెల్లించినా వినియోగదారులపై భారీగా భారం పడనుంది.
అత్యవసర సందర్భాల్లో క్రెడిట్ కార్డు ఉపయోగించి నగదు తీస్తుంటారు కొందరు. అలా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి లావాదేవీ చేసే వారు ఇకపై భారీగా మూల్యం చెల్లించాల్సిందే. ఇలా తీసిన మొత్తంపై అన్ని కార్డులపై 2.50 శాతం చొప్పున ఇకపై ఫీజుగా వసూలు చేయనున్నారు. కనీసం రూ.500 చొప్పున వసూలు చేస్తామని ఐసీఐసీఐ పేర్కొంది. అలాగే చెక్ రిటర్న్ అయినా, ఆటో డెబిట్ ఫెయిల్ అయినా బిల్లు మొత్తంలో 2 శాతం ఇకపై వసూలు చేస్తారు. కనీసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
ఏదైనా సందర్భంలో క్రెడిట్ కార్డు
బిల్లు ఆలస్యంగా చెల్లించినా భారీగా వాత తప్పదు. బిల్లు మొత్తం రూ.100లోపు ఉంటే ఎటువంటి ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు. అదే మొత్తం రూ.100-500 మధ్య అయితే రూ.100; రూ.501-5000 మధ్య అయితే రూ.500; రూ.5001- 10వేలు అయితే రూ.750; రూ.10001-25వేల వరకు రూ.900; రూ.25,001
నుంచి రూ.50వేల వరకు రూ.1000; రూ.50వేలు పైన ఎంతమొత్తమైనా రూ.1200 ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలన్నింటికీ మరో రూ.50+
జీఎస్టీ చెల్లించాలని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. ఎమరాల్డ్
క్రెడిట్ కార్డులకు ఆలస్య రుసుము ఛార్జీల నుంచి మినహాయింపు ఉంది. అయితే, సకాలంలో బిల్లులను చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలూ ఉండవు. ఆలస్యంగా
చెల్లింపులు చేయడం, ఏటీఎం కేంద్రాల నుంచి డబ్బులు డ్రా చేయడం
వంటివి చేసే వారికి మాత్రం ఈ రుసుములు వర్తిస్తాయి. ఈ భారం పడకూడదనుకుంటే..
క్రెడిట్ కార్డు వాడే విషయంలో అప్రమత్తంగా ఉండండి. నిర్దేశించిన గడువులోగా
చెల్లింపులు చేయండి.
0 Komentar