Income Tax Return (ITR) Filing Deadline Extended
– Details Here
ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు మరోసారి
పొడిగింపు – వివరాలు ఇవే
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును ఆడిట్ వర్తించే సంస్థలకు మళ్లీ పొడిగించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 2021-22 మదింపు సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి మార్చి 15 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు సీబీడీటీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని నిబంధనల ప్రకారం వివిధ ఆడిట్ రిపోర్టుల ఈ-ఫైలింగ్ చేసేటప్పుడు ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా కూడా ఈ గడువును పొడిగిస్తున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఐటీ శాఖ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
ఐటీ రిటర్నుల దాఖలు కోసం ఇన్ఫోసిస్
సంస్థ రూపొందించిన కొత్త వెబ్‌సైట్‌లో సాంకేతికత సమస్యల పరిష్కారం కొలిక్కిరాని
నేపథ్యంలో సెప్టెంబరు 30 వరకు ఉన్న ఈ గడువును డిసెంబర్ 31 వరకు పెంచుతూ గతంలో కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ఐటీఆర్ గడువును పెంచే యోచనలేదని గతేడాది డిసెంబర్‌లో స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా దేశంలో నెలకొన్న
కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
On consideration of difficulties reported by taxpayers/stakeholders due to Covid & in e-filing of Audit reports for AY 2021-22 under the IT Act, 1961, CBDT further extends due dates for filing of Audit reports & ITRs for AY 21-22. Circular No. 01/2022 dated 11.01.2022 issued. pic.twitter.com/2Ggata8Bq3
— Income Tax India (@IncomeTaxIndia) January 11, 2022
0 Komentar