Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Kerala’s Kumbalangi to Become India’s First Sanitary Napkin-free Village - World Menstrual Hygiene Day (May 28)

 

Kerala’s Kumbalangi to Become India’s First Sanitary Napkin-free Village

ఆదర్శ గ్రామం కుంబళంగి: శానిటరీ న్యాప్‌కిన్ రహిత గ్రామంగా కేరళలోని కుంబళంగి

=========================

World Menstrual Hygiene Day (May 28):

ఋతు పరిశుభ్రత దినోత్సవం (MHD) ప్రపంచ స్థాయిలో ఋతు పరిశుభ్రత నిర్వహణ (MHM) యొక్క ప్రాముఖ్యతను తెలియజేయటానికి మే 28న వార్షిక అవగాహన దినం ని జరుపుతారు.

దీనిని జర్మన్ నాన్-ప్రాఫిట్ వాష్ యునైటెడ్ 2013లో రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవాన్ని ప్రారంభించింది. ఇది మొదటిసారిగా 2014లో నిర్వహించబడింది మరియు అప్పటి నుండి ప్రజాదరణ పెరిగింది.

=========================

ఎర్నాకులంలోని కుంబళంగి గ్రామం దేశంలోనే ఫస్ట్ శానిటరీ న్యాప్‌కిన్ రహిత గ్రామంగా అవతరించింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఈ కార్యక్రమాన్ని జనవరి 13 న ప్రారంభించారు. ఎర్నాకులం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక ప్రచారంలో భాగంగా ఈ ఘనత సాధించింది ఈ విలేజ్. కార్యక్రమంలో భాగంగా.. 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు మెన్స్ట్రువల్ కప్పులు పంపిణీ పంపిణీ చేశారు. మొత్తం 5000 మెన్‌స్ట్రువల్ కప్పులను అందించినట్టు అధికారులు తెలిపారు.

పార్లమెంట్ సభ్యుడు హిబీ ఈడెన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్నాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో అమలవుతున్న ‘అవల్కాయి’ (ఆమె కోసం) పథకంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు. ఈ పథకం అమలులో HLL మేనేజ్‌మెంట్ అకాడమీ వారి ‘తింగల్’ పథకం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భాగస్వాములుగా ఉన్నారు. 

మోడల్ విలేజ్..

ఇదే కార్యక్రమంలో కుంబళంగిని మోడల్ విలేజీగా గవర్నర్ ప్రకటించారు. మోడల్ విలేజ్ ప్రాజెక్ట్ ప్రధాన మంత్రి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (SAGY) ద్వారా అమలు చేస్తున్నారు. కొచ్చిలో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణలలో ఒకటైన కుంబలంఘిలో కొత్త పర్యాటక సమాచార కేంద్రం కూడా ఉంటుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి మోడల్ టూరిస్ట్ గ్రామం అనే బిరుదును కూడా పొందింది.

మెన్స్ట్రువల్ కప్పుల అవగాహన కొరకు:  👇

Check Out Reusable Menstrual Cups Here 

Previous
Next Post »
0 Komentar

Google Tags