National Girls Child Day (January 24): History and Significance
Details Here
జాతీయ బాలికల దినోత్సవం: ఉద్దేశ్యం
మరియు ప్రాముఖ్యత వివరాలు ఇవే
=====================
ప్రతి సంవత్సరం జనవరి 24న
జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలోని బాలికలకు ప్రతి అంశంలో గరిష్ట
సహాయం మరియు సౌకర్యాలను అందించడం దీని ఉద్దేశ్యం. ఇది కాకుండా, జాతీయ బాలికా దినోత్సవం యొక్క ఇతర లక్ష్యం బాలికలపై వివక్ష గురించి అవగాహన
కల్పించడం. పురాతన కాలం నుండి, బాలికలు జీవితంలోని ప్రతి
అంశంలో వివక్ష మరియు హింసను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వారికి తగిన హక్కులు
కల్పించాల్సిన సమయం వచ్చింది. జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008లో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
బాలికల జాతీయ దినోత్సవం సందర్భంగా, బాలికల
హక్కులను గుర్తించి, వారికి మెరుగైన జీవితాన్ని, మంచి భవిష్యత్తును అందించడానికి ప్రపంచవ్యాప్తంగా వారు ఎదుర్కొంటున్న
సమస్యలను కూడా గుర్తిద్దాం.
“ధైర్యం, త్యాగం, సంకల్పం, నిబద్ధత,
దృఢత్వం, హృదయం, ప్రతిభ,
ధైర్యం. ఆ చిన్నారులు తయారు చేస్తారు; చక్కెర
మరియు మసాలాతో హెక్." -బెథానీ హామిల్టన్
చిన్నారులు దేవదూతల రెక్కలపై
గిరగిరా తిరుగుతూ, మా మార్గాల్లో బంగారు ధూళిని వెదజల్లుతూ మీ
హృదయంలోకి నృత్యం చేస్తారు. -అజ్ఞాతవాసి
“మీరు ఏదైనా చెప్పాలనుకుంటే,
ఒక వ్యక్తిని అడగండి; మీరు ఏదైనా చేయాలనుకుంటే,
ఒక స్త్రీని అడగండి." -మార్గరెట్ థాచర్
=======================
మహిళలకు రక్షణగా ఉన్న కొన్ని
ప్రత్యేక చట్టాల గురించి జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా
లింగ నిర్థారణ పరీక్షల నిషేధ చట్టం
(1994):
ఈ చట్టం ప్రకారం మహిళల ఇష్టానికి
వ్యతిరేకంగా గర్భవిచ్ఛిత్తికి ఒత్తిడి చేసినట్లయితే శిక్షార్హులు అవుతారు. కుటుంబ
సభ్యులుకానీ, ఇతరులు ఎవరైనా కానీ ఆడ శిశువుల భ్రూణహత్యలకు
పాల్పడినట్లయితే ఈ చట్టం ద్వారా మహిళలు రక్షణ పొందవచ్చు. బాధ్యులకు శిక్షలు పడే
అవకాశం ఉంటుంది. ప్రతి ప్రయివేటు ఆసుపత్రుల్లో ఈ చట్టానికి సంబంధించిన సమాచారం
అందుబాటులో ఉంటుంది.
బాల్యవివాహాల నిరోధక చట్టం (2006):
ఈ చట్టం ప్రకారం 18
ఏళ్లలోపు బాలికలకు వివాహం చేయడం నేరం అవుతుంది. బాల, బాలికలను
వివాహం చేసుకున్నవారు, చేయించినవారు, పెద్దలు,
ఇరువురి కుటుంబ సభ్యులు ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారు.
వరకట్న నిషేధ చట్టం (1961):
ఏటా వరకట్న నిర్మూలన దినోత్సవాన్ని
జరుపుకొంటుంటాం. వరకట్న నిషేధ చట్టంపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 1961లో అమల్లºకి
వచ్చిన ఈ చట్టం ప్రకారం వివాహానికి ముందుకానీ, తరువాత కానీ వరకట్నం
ఇవ్వడం, తీసుకోవడం నేరం అవుతుంది. కట్నం డిమాండ్ చేసిన
వారిని కఠినంగా శిక్షించే అవకాశాన్ని మహిళలకు ఈ చట్టం కల్పిస్తోంది.
పోక్సో చట్టం (2012):
ఈ చట్టం ప్రకారం పని చేసే ప్రదేశాల్లో పసిపిల్లలను, ఆడపిల్లలను
లైంగిక వేధింపులకు గురి చేస్తే దాన్ని నియంత్రించే హక్కును కల్పించింది. దీనినే
పోక్సో చట్టం అంటారు.
గృహహింస నిరోధక చట్టం - 2005
ప్రకారం ఇంట్లోని మహిళలపై జరిగే
మానసిక,
శారీరక దాడులు, హింసను అరికట్టాలనే ఉద్ధేశంతో
ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టప్రకారం మహిళలకు హాని కలిగించినా, భావోద్వేగపూరిత మాటలతో దూషించినా, వరకట్నం కోసం
వేధించినా, ఆమె ఆస్తులను స్వాధీనపరచుకోవాలని ప్రయత్నించినా
నేరం అవుతుంది. బాలికలు, స్త్రీల సంరక్షణకు మనోవర్తిని కూడా
పొందవచ్చు. ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులు, న్యాయస్థానాలు,
స్త్రీ, శిశుసంక్షేమశాఖ అధికారులను సంప్రదించి
న్యాయం పొందచ్చు.
నిర్భయ చట్టం - 2013...
దిల్లీలో జరిగిన సంఘటన నేపథ్యంలో
అప్పటి కేంద్రప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఆడపిల్లలు, మహిళలపై
లైంగిక దాడులు, యాసిడ్ దాడులు, లైంగిక
వేధింపులు, కిడ్నాప్‌లు, హింస వంటి
సంఘటనలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ చట్టం ప్రకారం కేసు నమోదు అయితే కఠినంగా
శిక్షలు ఉంటాయి.
హిందూ వారసత్వ చట్టం (1956):
ఈ చట్టాన్ని ప్రభుత్వం మళ్లీ 2005 - 06లో సవరించింది. ఆర్థిక
సమానత్వాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన చట్టం ఇది. మహిళలకు తండ్రి ఆస్తిలో
మగపిల్లలతో పాటు సమాన వాటాను పొందే అవకాశం ఉంది. ప్రతి ఆడపిల్లకు జన్మాంతం ఆస్తిలో
సమాన హక్కును కల్పించారు.
బాలల న్యాయ పోషణ రక్షణ చట్టం (2015):
ఈ చట్టం ద్వారా బాలికలకు అవసరమైన
రక్షణ,
వసతి, పోషణ కల్పిస్తారు.
మహిళలపై అసభ్య ప్రవర్తన నిరోధక
చట్టం:
ఈ చట్టం ప్రకారం మహిళలను
కించపరిచేలా మాట్లాడినా, వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా
శిక్షార్హులవుతారు. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించేలా బొమ్మలు, ప్రదర్శనలు, రాతలు, నగ్నచిత్రాలు
వంటివి ప్రదర్శించినా నేరం అవుతుంది. ఐపీసీ 509, 354 (ఏ,బీ,సీ,డీ) సెక్షన్ల ప్రకారం
ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం నేరంగా పరిగణిస్తారు.
ర్యాగింగ్ నిషేధ చట్టం:
ఈ చట్టం అమలులోకి వచ్చిన
తరువాత విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతం
ఆటకట్టించినట్లు అయింది. బాల, బాలికలను అనుచిత ప్రవర్తనలతో
ర్యాగింగ్ చేసి వారిని ఇబ్బందులకు గురిచేయడం నేరం అవుతుంది. ఈ చట్టం
విద్యాభ్యాసానికి అనువైన చక్కటి వాతావరణం కల్పించింది.
న్యాయసేవాధికార చట్టం (1987):
ఈ చట్టం ప్రకారం బాలికలందరూ న్యాయ
సహాయం పొందటానికి అర్హులు
సమాన వేతన చట్టం: 1976లో ఈ చట్టాన్ని చేశారు. దీని
ప్రకారం స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం
కల్పించాలి. లింగ వివక్ష ఆధారంగా స్త్రీ వేతనాలు తగ్గించడం నేరం అవుతుంది.
ఒకే పనిని స్త్రీ, పురుషులు
ఒకేలా చేస్తే ఇద్దరికి సమాన వేతనం కల్పించాలని ఈ చట్టం చెబుతోంది.
=====================
జాతీయ
బాలికల దినోత్సవం 2021: థీమ్ మరియు ప్రాముఖ్యత
=====================
0 Komentar