NHPC Recruitment 2022: Apply for 133 Junior
Engineer Posts – Details Here
ఎన్‌హెచ్ పీసీలో 133 జూనియర్ ఇంజినీర్లు – అర్హత, ఎంపిక
విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి
మంత్రిత్వశాఖకి చెందిన మినీరత్న సంస్థ అయిన నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్
కార్పొరేషన్ (ఎన్ హెచ్ పీసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్ ఇంజినీర్లు
మొత్తం ఖాళీలు: 133
విభాగాల వారీగా ఖాళీలు: సివిల్-68, ఎలక్ట్రికల్-34, మెకానికల్-31.
అర్హత: కనీసం 60
శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.29,600 నుంచి రూ.1,19,500 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
ఆన్లైన్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని
మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో 200 మార్కులకి
నిర్వహిస్తారు. ఇందులో 140 ప్రశ్నలు అభ్యర్థులు ఎంచుకున్న
సంబంధిత టెక్నికల్ సబ్జెక్టు నుంచి, 30 ప్రశ్నలు జనరల్ అవేర్
నెస్, 30 ప్రశ్నలు రీజనింగ్ నుంచి ఉంటాయి. పరీక్షా సమయం 3 గంటలు ఉంటుంది. ఈ పరీక్షని ఇంగ్లిష్, హిందీ
మాధ్యమాల్లో నిర్వహిస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పత్రి తప్పు
సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 31.01.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 21.02.2022.
0 Komentar