PGCIL Recruitment 2022: Apply For 105 Assistant Engineer Trainee Posts
– Details Here
పవర్ గ్రిడ్ లో 105 అసిస్టెంట్ ఇంజినీర్ ట్రెయినీలు – అర్హత, జీతభత్యాలు, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి
మంత్రిత్వ శాఖకి చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్ ఇంజినీర్ ట్రెయినీలు
మొత్తం ఖాళీలు: 105
విభాగాల వారీగా ఖాళీలు: కంప్యూటర్
సైన్స్-37,
ఎలక్ట్రికల్-60, సివిల్-04, ఎలక్ట్రానిక్స్-04.
అర్హత: కనీసం 60
శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్
సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తర్ణత. వాలిడ్ గేట్
2021 స్కోర్ ఉండాలి.
వయసు: 31.12.2021 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: ట్రెయినింగ్ పీరియడ్లో
నెలకి రూ.40,000 + ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. విజయవంతంగా ఏడాది
ట్రెయినింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు (ఇంజినీర్ ఈ 2 స్కేల్)
నెలకి రూ.50,000 నుంచి రూ.1,60,000 + ఇతర
అలవెన్సులు అందజేస్తారు.
ఎంపిక విధానం: గేట్ 2021 మెరిట్ స్కోర్, బిహేవియరల్ అసెస్ మెంట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి . దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500 చెల్లించాలి.
ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 27.01.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.02.2022.
0 Komentar