Physical Attendance of Govt Employees Restricted
to 50%, Biometric Attendance Discontinued
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భౌతిక హాజరు 50%కి పరిమితం - బయోమెట్రిక్ హాజరు నిలిపివేత
అండర్ సెక్రటరీ కంటే దిగువస్థాయి
ఉద్యోగులకు కేంద్రం అనుమతి
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న
నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అండర్ సెక్రటరీ కంటే
దిగువస్థాయి ఉద్యోగుల్లో 50 శాతం మంది ఇంటి నుంచే పనిచేసేందుకు
అనుమతించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు
జారీచేసింది. గర్భిణులు, దివ్యాంగులు కార్యాలయాలకు రావడంపై
మినహాయింపు ఇచ్చింది.
అదే సమయంలో సిబ్బంది కార్యాలయాలకు
వచ్చేందుకు, కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు రెండు సమయాలను
నిర్ణయించింది. ఉదయం 9 గంటలకు వచ్చినవారు సాయంత్రం 5.30 గంటలకు, ఉదయం 10 గంటలకు
వచ్చినవారు సాయంత్రం 6.30 గంటలకు వెళ్లాలని ఆదేశించింది.
రాకపోకల సమయంలో రద్దీని
నివారించేందుకే ఈ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో
ఉండేవారు కూడా కార్యాలయాలకు రానక్కర్లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అండర్
సెక్రటరీ,
అంతకంటే ఎక్కువ ర్యాంకుల్లో ఉన్న అధికారులు కార్యాలయాలకు రావాల్సి
ఉంటుందని పేర్కొంది. కార్యాలయాల్లో జరిగే సమావేశాలను వీలైనంత మేరకు వీడియో సమావేశం
విధానంలో నిర్వహించాలని సూచించింది. కార్యాలయాలకు వచ్చే సందర్శకులతో భేటీ అవడం
అత్యవసరం, తప్పనిసరి అయితే తప్ప విరమించుకోవాలని తెలిపింది.
మాస్కులు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం సహా
కార్యాలయాల్లో కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా అమలయ్యేలా అధికారులు అంతా జాగ్రత్తలు
తీసుకోవాలని కోరింది.
ప్రభుత్వ ఉద్యోగుల బయోమెట్రిక్
హాజరును కేంద్రం నిలిపివేత
మరోసారి దేశంలో కొవిడ్ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొంది. గత కొన్ని రోజులుగా భారీగా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఇది అమలులోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు అమలులో ఉంటుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి డా.జితేంద్ర సింగ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఉద్యోగుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
గతేడాది కూడా కరోనా ఉద్ధృతి
నేపథ్యంలో తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా బయోమెట్రిక్ హాజరు విధానం నుంచి
కేంద్రం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత దేశంలో
సాధారణ పరిస్థితులు నెలకొనడంతో గతేడాది నవంబర్ 8 నుంచి
అన్ని స్థాయిల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేసింది. దీంతో పాటు
బయోమెట్రిక్ యంత్రాల పక్కన శానిటైజర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఉద్యోగులు హాజరుకు ముందు, తర్వాత తమ చేతులను విధిగా
శుభ్రపరచుకునేలా చూసుకునే బాధ్యత విభాగాధిపతులదేనంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే,
తాజాగా దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో బయోమెట్రిక్
హాజరు విధానం నుంచి మరోసారి మినహాయింపు ఇచ్చింది.
OFFICIAL
MEMO ON BIOMETRIC ATTENDANCE
IMPORTANT ANNOUNCEMENT by #DoPT:
— Dr Jitendra Singh (@DrJitendraSingh) January 3, 2022
Keeping in view the rise in #COVID cases in the last few days, the BIOMETRIC ATTENDANCE for govt officials and employees is being suspended with immediate effect, till further orders.
Under leadership of PM Sh @NarendraModi, this
1/2
0 Komentar