Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Press Conference by Chief Secretary to Govt of AP Dr Sameer Sharma IAS at Block-5, Secretariat LIVE

 

Press Conference by Chief Secretary to Govt of AP Dr Sameer Sharma IAS at Block-5, Secretariat LIVE

Press Conference by Chief Secretary to Govt of Andhra Pradesh Dr Sameer Sharma IAS at Collector's Conference Hall, Block-5, AP Secretariat on 19-01-2022 LIVE.1

==================

సీఎస్‌ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంపై కరోనా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించింది. రాష్ట్రానికి రూ.62వేల కోట్ల రెవెన్యూ ఉంది. కరోనా లేకపోయి ఉంటే రాష్ట్ర రెవెన్యూ రూ.98 వేల కోట్లు ఉండేది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా రాష్ట్ర రెవెన్యూ పడిపోయింది. గత పరిస్థితులకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఒమిక్రాన్‌ కారణంగా రాష్ట్ర రెవెన్యూపై తీవ్ర ప్రభావం పడింది. రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగుల వ్యయం చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు, సంక్షేమ పథకాలకు ఎలా ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచించాలి. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లడమే ప్రభుత్వ కర్తవ్యం. రాష్ట్ర బడ్జెట్‌లో పీఆర్సీతో పాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విద్య, సంక్షేమం, మౌలిక సదుపాయాలు, ఇతరత్రా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సవాళ్లు ఎదుర్కొన్నాం. ఆర్థికంగా రాష్ట్ర స్వరూపమే మారిపోయింది. రాష్ట్ర పరిస్థితులు దిగజారిపోయాయి. కరోనా వేళ ఇతర రాష్ట్రాలు సంక్షేమ పథకాలు తగ్గించాయి. సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించాం. ఉద్యోగులు, పింఛనర్లు అందరికీ ప్రభుత్వం న్యాయం చేసింది. రాష్ట్రానికైనా, కుటుంబానికైనా ఆర్థిక వనరుల వినియోగం ఒకేలా ఉంటాయి. పరిమితంగా ఉన్న వనరుల వినియోగంలో సవాళ్లు ఉంటాయి. ఉద్యోగులు, సంక్షేమం సహా అన్ని రంగాలకు ఆర్థిక వనరులు పంచాలి. కొవిడ్ వేళ చాలా రాష్ట్రాలు సంక్షేమ బడ్జెట్‌లో కోతపెట్టాయి. ఏపీలో సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నాం. విభజన నుంచి కరోనా వరకు ఆర్థిక వనరులు ఒడిదుడుకుల్లో ఉన్నాయి. పరిశ్రమలు, సర్వీసుల రంగం ఒడిదుడుకులకు లోనైంది. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ న్యాయం జరిగిందనే అనుకుంటున్నాం’’ అని సీఎస్‌ వివరించారు.

====================

ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రావత్‌ మాట్లాడుతూ.. విభజన కారణంగా ఏపీ ఆర్థికంగా దిగజారిపోయిందని తెలిపారు. సేవా రంగం నుంచి వచ్చే పన్నుల ఆదాయం తగ్గిపోయిందని తెలిపారు. ఏపీలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉందని చెప్పారు. వ్యవసాయం నుంచి పన్నుల ఆదాయం ఉండదని తెలిపారు. విభజనే వల్ల హైదరాబాద్‌ను కోల్పోయామని చెప్పారు.

దాంతో పాటే పన్నుల ఆదాయం కూడా నష్టపోయామని పేర్కొన్నారు. ఏపీకి జనాభా ఎక్కువ.. పన్నుల ఆదాయం తక్కువ అని చెప్పారు. ఇంకా రూ. 33, 90 కోట్ల అప్పుల విభజన జరగాల్సి ఉందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా తగ్గిపోయిందని తెలిపారు. ఐఆర్‌ రూపంలో రూ. 17, 918 కోట్లు ఇచ్చామని వివరించారు. అంగన్‌వాడీ, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి గౌరవ వేతనం పెంచామని చెప్పారు. ఆశా వర్కర్లకు కూడా గౌరవ వేతనాలు పెంచామని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా వేతనాలు పెంచామని చెప్పారు. కాంట్రాక్ట్‌ వర్కర్లకు మినిమం టైమ్‌ స్కేల్‌ అమలు చేస్తున్నామని రావత్‌ తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags