Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Increases IMPS Transaction Limit and to Charge Per Transaction - Details Here

 

SBI Increases IMPS Transaction Limit and to Charge Per Transaction - Details Here

ఐఎంపీఎస్‌ లిమిట్‌ పెంచిన ఎస్‌బీఐ - రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్రతి లావాదేవీకి ఛార్జీల వివరాలు ఇవే

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఐఎంపీఎస్‌ (ఇమిడియెట్‌ పేమెంట్‌ సర్వీస్‌) లావాదేవీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో గరిష్ఠంగా రూ.2 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని బ్యాంకులకు ఆర్‌బీఐ గతేడాది అక్టోబర్‌లో సూచించింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్రతి లావాదేవీకి రూ.20+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 

24×7 ఎప్పుడైనా నగదు పంపుకొనేందుకు IMPS సాయపడుతుంది. ఆదివారాలు, సెలవు రోజుల్లో సైతం నగదు పంపుకొనే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం వెయ్యి రూపాయల వరకు ఎలాంటి ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు. వెయ్యి నుంచి రూ.10 వేల వరకు రూ.2+జీఎస్టీ; రూ.10వేలు నుంచి రూ.లక్ష వరకు రూ.4+ జీఎస్టీ; లక్ష రూపాయల నుంచి రూ.2 లక్షల వరకు రూ.12+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల శ్లాబ్‌ను ఎస్‌బీఐ ఏర్పాటు చేసింది.

కొత్త ఛార్జీల వివరాలు ఇవే 

* రూ. 5 లక్షల వరకు ఇంటర్నెట్‌ లేదా మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా చేసే ఏదైనా ఐఎంపీఎస్‌ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. వీటిలో యోనో యాప్‌ లావాదేవీలకు కూడా వర్తించనుంది.

* ఐఎంపీఎస్‌ లావాదేవీల్లో భాగంగా  రూ.1,000 నుంచి రూ.10,000 వరకు బదిలీ చేస్తే  రూ. 2తో పాటు జీఎస్టీ చెల్లించాలి.

* రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు ఐఎంపీఎస్‌ లావాదేవీపై రూ. 4తో పాటుగా జీఎస్టీ చెల్లించాలి.

* రూ.1,00,000 నుంచి రూ.2,00,000 వరకు జరిపే లావాదేవీలపై  రూ.12తో పాటు జీఎస్టీని ఛార్జ్‌ చేయనుంది.

* తాజాగా ఎస్బీఐ   రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు కొత్త స్లాబ్‌ను యాడ్‌ చేసింది. ఈ నగదు లావాదేవీలపై రూ.  20 పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags