Senior Rocket Scientist Somanath Is New
ISRO Chairman - ISRO Successfully Conducts Cryo Engine Test for Gaganyaan
Rocket
ఇస్రో కొత్త ఛైర్మన్‌గా రాకెట్
శాస్త్రవేత్త సోమనాథ్ - ‘గగన్‌యాన్’ క్రయోజెనిక్ ఇంజిన్ అర్హత
పరీక్ష విజయవంతం
ఇస్రో కొత్త ఛైర్మన్‌గా సీనియర్
రాకెట్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్.సోమనాథ్ నియామకానికి కేంద్ర కేబినెట్ కమిటీ
బుధవారం ఆమోదం తెలిపింది. ఈయన ఇస్రో ఛైర్మన్ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు.
ఇప్పటిదాకా సోమనాథ్.. తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రం
సంచాలకునిగా వ్యవహరించారు. ఇస్రో ప్రస్తుత ఛైర్మన్ శివన్ పదవీకాలం ఈ నెల 14న
పూర్తి కానుండటం వల్ల సోమనాథ్ నియామకం జరిగింది. ఈయన ఈ ప్రతిష్ఠాత్మక అతరిక్ష
సంస్థకు పదో ఛైర్మన్. శివన్ 2018 జనవరిలో ఇస్రో ఛైర్మన్‌గా
నియమితులై.. ఏడాది పొడిగింపుతో కలిపి
నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వహించారు.
కేరళ రాష్ట్రానికి చెందిన సోమనాథ్
కొల్లంలోని టీకేఎం ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్
మాస్టర్స్ చేశారు. ఎంటెక్‌లో ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించారు. 1985లో ఇస్రోలోని ప్రధాన కేంద్రమైన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో
ఉద్యోగ బాధ్యతలు చేపట్టి, పీఎస్‌ఎల్‌వీ ప్రాజెక్టు మేనేజరుగా
ఉంటూ మెకానిజమ్స్, ఫైరో సిస్టమ్స్, ఇంటిగ్రేషన్,
శాటిలైట్ లాంచ్ సర్వీస్ మేనేజ్‌మెంట్ విభాగాలను నిర్వహించారు. 2003లో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 డిప్యూటీ ప్రాజెక్టు
డెరెక్టరుగా నియమితులయ్యారు. అనంతరం 2010 నుంచి 2014 వరకు జీఎస్‌ఎల్‌వీ-మార్క్3 ప్రాజెక్టు డైరెక్టరుగా
పనిచేశారు. సోమనాథ్ నాయకత్వాన కేర్ మిషన్ మొట్టమొదటి ప్రయోగాన్ని 2014 డిసెంబరు 18న ప్రయోగాత్మకంగా చేపట్టి, విజయవంతం చేశారు.
‘గగన్‌యాన్’ క్రయోజెనిక్
ఇంజిన్ అర్హత పరీక్ష విజయవంతం
ప్రతిష్ఠాత్మక ‘గగన్‌యాన్’
ప్రాజెక్టు కోసం క్రయోజెనిక్ ఇంజిన్ అర్హత పరీక్షను ఇస్రో బుధవారం విజయవంతంగా
నిర్వహించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ సముదాయం (ఐపీఆర్‌సీ)
వద్ద 720 సెకన్ల పాటు ఇంజిన్‌ను మండించింది. ఈ దీర్ఘకాలిక పరీక్షకు సంబంధించిన
అన్ని పరామితులను ఇంజిన్ అందుకున్నట్లు ఇస్రో తెలిపింది. మున్ముందు దానికి మరో
నాలుగు పరీక్షలు (మొత్తంగా 1,810 సెకన్ల పాటు మండిస్తారు)
నిర్వహించనున్నారు. అనంతరం మరో ఇంజిన్‌కు.. గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం ఒక
దీర్ఘకాలిక, రెండు స్వల్పకాలిక అర్హత పరీక్షలను
నిర్వహించనున్నారు.
0 Komentar