TS: ఉద్యోగుల 3 డీఏలు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు,
పింఛనుదారులకు పెండింగులో ఉన్న 3 డీఏలు మంజూరు
చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడింటికి కలిపి 10.01 శాతం చెల్లింపులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం
తెలిసిందే. మంత్రివర్గంలో నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పెరిగిన డీఏ 2021 జులై 1 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో
పేర్కొన్నారు. ఈనెల నుంచి వేతనంతో పాటు పెరిగిన డీఏ ఉద్యోగులకు అందనుంది. 2021 జులై నుంచి బకాయిలు జీపీఎఫ్‌లో ప్రభుత్వం జమ చేయనుంది. కరోనా కారణంగా
రెండేళ్లుగా డీఏల చెల్లింపులో జాప్యం ఏర్పడింది. మూడు డీఏలను ఒకేసారి
చెల్లించేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
=============
GO DETAILS:
ALLOWANCES – Dearness Allowance – Revision
of Dearness Allowance to the State Government Employees from 01.01.2020,
1.7.2020 and 1.1.2021, payable from 1st of July, 2021 – Sanctioned –
Orders – Issued.
G.O.Ms.No.3, Dated: 19th
January, 2022
==================
PENSIONS – Dearness Relief to the State
Government Pensioners from 01.01.2020, 1.7.2020 and 1.1.2021, payable from 1st
of July, 2021 – Sanctioned – Orders – Issued.
G.O.Ms.No.4, Dated: 19th January, 2022
0 Komentar