TS: వచ్చే విద్యా సంవత్సరం నుంచి
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
ఆంగ్ల మాధ్యమం, ప్రైవేటు పాఠశాలలు,
జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రణ పై
కొత్త చట్టం తీసుకురావాలని కేబినెట్ తీర్మానించింది. ఆంగ్ల మాధ్యమం, ఫీజుల నియంత్రణ పై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎం నిర్ణయం
తీసుకున్నారు. ఈ రెండు అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి విధివిధానాల
రూపకల్పనకు మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా
రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో మంత్రులు కేటీఆర్, హరీశ్
రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్
రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్
గౌడ్, జగదీశ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలను
బలోపేతం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం మౌలిక వసతుల కోసం 'మన
ఊరు-మన బడి' కార్యక్రమం కింద రూ.7,289 కోట్లు
కేటాయించింది.
'మన ఊరు-మన బడి' - మూడేళ్లలో.. మూడు దశల్లో...
*తొలి విడతలో 9,123 స్కూళ్ల అభివృద్ధి..
*మొదటగా మండలాల్లో అత్యధిక
ఎన్ రోల్ మెంట్ ఉన్న (35శాతం) స్కూళ్లలో అమలు..
ప్రతీ పాఠశాలలో పటిష్టం చేయనున్న 12
విభాగాలు
1.నీటి సౌకర్యంతో కూడిన
టాయిలెట్లు
2.విద్యుద్దీకరణ
3.తాగునీటి సరఫరా
4.విద్యార్థులు, సిబ్బందికి సరిపోయే ఫర్నిచర్
5.పాఠశాల మొత్తం పెయింటింగ్
వేయడం
6. పెద్ద, చిన్న మరమ్మతులు చేపట్టడం
7.గ్రీన్ చాక్ బోర్డుల
ఏర్పాటు
8.ప్రహరీ గోడల నిర్మాణం
9.కిచెన్ షెడ్లు నిర్మాణం
10.శిథిలమైన గదుల స్థానంలో
కొత్త క్లాస్ రూంల నిర్మాణం
11.ఉన్నత పాఠశాలల్లో
డైనింగ్ హాల్స్ ఏర్పాటు
12.డిజిటల్ విద్య అమలు
0 Komentar