Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం: విద్యాశాఖ మంత్రి సబిత

 

TS: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం: విద్యాశాఖ మంత్రి సబిత

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలన్నింటినీ పునఃప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు.  ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూళ్లు కాలేజీలు తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 30 తర్వాత పాఠశాలలు తెరుస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు  నిర్వహిస్తున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags