WhatsApp for Desktop Adds Pause and
Resume Recording Voice Message Feature
వాట్సాప్ డెస్క్‌టాప్‌లో వాయిస్ పాజ్-అండ్-రెస్యూమ్/ప్లే
ఫీచర్
వాట్సాప్‌లో టైప్ చేయకుండా మనం
చెప్పాలనుకుంటున్న సమాచారం ఇతరులకు తెలియజేసేందుకు ఉన్న మరో ఆప్షన్ వాయిస్
మెసేజ్. గతేడాది చివర్లో వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో కొత్త ఫీచర్లను పరిచయం
చేస్తున్నట్లు తెలిపింది. వాటిలో కొన్ని ఫీచర్లను బీటా యూజర్లకు అందుబాటులోకి
తీసుకొచ్చింది. తాజాగా వాయిస్ మెసేజ్ డెస్క్‌టాప్‌లో మరో కొత్త ఫీచర్‌ను
యూజర్లకు పరిచయం చేసింది. పాజ్-అండ్-రెస్యూమ్/ప్లే (Pause-and-Resume/Play)
పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకురానుంది. దీంతో యూజర్లు మెసేజ్ రికార్డు
చేసేటప్పుడు ఆడియోను పాజ్ చేసి, ముందు రికార్డు చేసినదాన్ని
విని, తిరిగి రికార్డింగ్ ప్రారంభించవచ్చు. అంటే ఇది పాజ్
అండ్ ప్లే తరహాలో పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్ది మంది ఆండ్రాయిడ్
యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలో పూర్తి స్థాయిలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు పరిచయం చేయనున్నారు. వాట్సాప్ డెస్క్‌టాప్‌లో ఈ
విధంగా కనిపిస్తుంది.
వాట్సాప్ ఇదే ఫీచర్‌ను వాయిస్ మెసేజ్ ప్రివ్యూ పేరుతో యాప్‌లో కూడా పరిచయం చేయనుంది. వీటితోపాటు వాట్సాప్‌లో ఫొటో ఎడిట్ చేసుకునేందుకు వీలుగా ఎడిట్ టూల్‌ను తీసుకురానుంది. దీంతో యూజర్లు చాట్ పేజ్ నుంచి తాము పంపే మీడియా ఫైల్స్‌ను క్రాప్ చేయడంతోపాటు వాటిపై ఎమోజీలు, జిఫ్, స్టిక్కర్స్ వంటివి యాడ్ చేయొచ్చు. వీటితోపాటు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ మెసేజ్, చాట్ లిస్ట్‌లో మార్పులు, అడ్వాన్స్‌డ్ సెర్చ్ వంటి కొత్త పీచర్లను వాట్సాప్ తీసుకురానుంది. అంతేకాకుండా వాట్సాప్ మరో కీలక ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. దీంతో ఇతరుల నుంచి మనకు మెసేజ్ వచ్చినప్పుడు లాక్‌స్క్రీన్ నోటిఫికేషన్లలో వారి ప్రొఫైల్ ఫొటో/డీపీ (డిప్‌ప్లే పిక్చర్) కనిపిస్తుంది. దానివల్ల మనకు ఎవరు మెసేజ్ చేశారనేది సులువుగా గుర్తించవచ్చు. గతంలో నోటిఫికేషన్ సెంటర్లో కేవలం మెసేజ్ పంపిన వారి నంబర్/పేరు మాత్రమే కనిపించేవి. త్వరలో రానున్న అప్‌డేట్‌తో వారి ఫొటో కూడా కనిపిస్తుంది.
WhatsApp Desktop beta lets you pause and resume voice recordings!
— WABetaInfo (@WABetaInfo) January 19, 2022
The ability to pause and resume voice notes during recording is now available for the desktop client.https://t.co/zPUNRLf2P8
0 Komentar