Airtel Xstream Premium Announced with 15
OTT services
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్
ప్రీమియం స్ట్రీమింగ్ సర్వీస్. - 15 ఓటీటీల కంటెంట్ ఒకే యాప్‌లో
టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్.. వీడియో స్ట్రీమింగ్ సేవలపై దృష్టి సారించింది. 15 వీడియో యాప్స్ నుంచి కంటెంట్ అందించేందుకు కొత్త వేదికను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ద్వారా ఉచిత సేవలను అందిస్తుండగా.. కొత్తగా ఆ సేవలను నవీకరించింది. ఇకపై ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం పేరిట చందాను వసూలు చేయనుంది. నెలవారీ చందాను రూ.149గా నిర్ణయించింది. దేశ, విదేశాలకు చెందిన 15 ఓటీటీల కంటెంట్‌ను ఒకే యాప్‌లో అందించేందుకు ఈ సర్వీస్‌ను ప్రారంభించామని, 20 మిలియన్ల పెయిడ్ సబ్‌స్క్రైబర్లను లక్ష్యంగా పెట్టుకున్నామని ఎయిర్‌టెల్ డిజిటల్ సీఈవో ఆదర్శ్ నాయర్ తెలిపారు.
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం ద్వారా 10,500 మూవీస్, షోలు, లైవ్ చానెళ్లను యూజర్లు వీక్షించొచ్చని ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. సోనీలివ్, ఎరోస్ నౌ, లైన్స్‌గేట్ ప్లే, హోయ్‌చోయ్, మనోరమ మ్యాక్స్, షెమారూ, అల్ట్రా, హంగామా ప్లే, ఎపికాన్, డాక్యుబే, డివో టీవీ, క్లిక్, నమ్మఫ్లిక్స్, డాలీవుడ్, షార్ట్స్ టీవీ వంటి వీడియో స్ట్రీమింగ్ సేవలను ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం ద్వారా పొందొచ్చని పేర్కొంది. మొబైల్, టాబ్లెట్, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించి యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ సెటాప్ బాక్స్ ద్వారా టీవీల్లోనూ వీక్షించొచ్చు. ప్రస్తుతానికి ప్రీమియం సేవలు ఎయిర్‌టెల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
దేశంలో ఓటీటీ వినియోగం రోజురోజుకూ
పెరుగుతోంది. 2025 నాటికి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ మార్కెట్ విలువ 2 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుతుందని మీడియా పార్టనర్ ఆసియా నివేదిక
తెలిపింది. ప్రస్తుతం ఈ మార్కెట్ విలువ 500 బిలియన్
డాలర్లుగా ఉంది. రాబోయే రోజుల్లో చిన్న పట్టణాలు, నగరాల
నుంచి కొత్త యూజర్లు రాబోతున్నారని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఎక్స్‌ట్రీమ్
ప్రీమియం సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించడం గమనార్హం.
డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రధాన స్రవంతిగా మార్చడమే లక్ష్యంగా ఈ ప్రయాణాన్ని
ప్రారంభించినట్లు నాయర్ ఈ సందర్భంగా
తెలిపారు.
0 Komentar