AP
Covid-19 Media Bulletin 08-02-2022
ఏపీలో
కొత్తగా 1,891 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 26,236
పరీక్షలు నిర్వహించగా.. 1,891 కేసులు నిర్ధారణ
అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 23,06,943 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన
24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 5 మంది మరణించారు. దీంతో
రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,677 కి చేరింది.
24 గంటల వ్యవధిలో 10,241 మంది బాధితులు కోలుకోవడంతో
రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 22,38,226
చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 54,040 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,27,05,524
నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Previous
Day Bulletin 👇
0 Komentar