Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP District Restructuring, 2022 – Human Resources- Allocation - Procedural Guidelines

 

AP District Restructuring, 2022 – Human Resources- Allocation - Provisional allocation of posts & personnel in the restructured District / Division offices – Procedural Guidelines

AP లో కొత్త జిల్లాల ఏర్పాటు, పోస్టుల వర్గీకరణ, ఉద్యోగుల కేటాయింపు పై పూర్తి స్తాయి అధికారిక ఉత్తర్వులు విడుదల

కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు, పోస్టుల విభజనపై మార్గదర్శకాలు జారీ

జిల్లాల పునర్‌ వ్వవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల కేటాయింపు, పోస్టుల విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొత్త జిల్లాల్లో ఈ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు ఆప్షన్‌ ఫామ్‌లు జారీ అయ్యాయి. సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ వీటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్‌ 2 ఉగాది నాటి నుంచి కొత్త జిల్లాల్లోని పునర్‌వ్యవస్థీకరించిన ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లు పనిచేయడం ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 2.. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి అపాయింటెడ్‌ డేగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా వనరులు, ఉద్యోగుల శాశ్వత విభజనకు కొంత సమయం పడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో ప్రభుత్వ విధులు సాఫీగా జరిగేందుకు తాత్కాలికంగా ఉద్యోగులు, పోస్టులు, వనరుల కేటాయింపు అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాత్కాలిక కేటాయింపుల కోసం రాష్ట్ర, ప్రాంతీయ, జోనల్‌, మండల, గ్రామ స్థాయిలోని కార్యాలయాలు, పోస్టుల విభజన, కేటాయింపు ఉండబోదని స్పష్టం చేసింది. జిల్లా, డివిజన్‌ స్థాయిలోని ఉద్యోగులను మాత్రమే తాత్కాలిక ప్రాతిపదికన కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల అంశాన్ని ఆర్థికశాఖ పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. కొత్త జిల్లాలకు ఆర్డర్‌ టు సర్వ్‌ పేరిట తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులు జారీ అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్డర్‌ టు సర్వ్‌ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఉద్యోగులు ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లే అవకాశమున్నందున బదిలీలపై నిషేధం ఉత్తర్వులను సడలించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను కూడా తాత్కాలిక ప్రాతిపదికనే కొత్త జిల్లాలకు కేటాయించనున్నట్టు స్పష్టం చేసింది. 

ఏపీ పోలీసు విభాగం మినహా మిగతా ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు కొత్త జిల్లాలు, డివిజన్లకు అనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపింది. మార్చి 11వ తేదీ నాటికి ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల జాబితా సిద్ధమవుతుందని పేర్కొన్న ప్రభుత్వం.. తుది జాబితాకు అనుగుణంగా ఆర్డర్‌ టు సర్వ్‌ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు స్పష్టం చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది.

=====================

Finance Department - District Restructuring, 2022 – Human Resources- Allocation - Provisional allocation of posts & personnel in the restructured District / Division offices – Procedural Guidelines - Orders- Issued

--------------------------------------------------

G.O.Ms.No.31, Dated: 26-02-2022.

Read the following:

 1. G.O.Rt.No.2098, Finance (Budget. I) Department, dated 07-08-2020.

 2. G.O.Rt.No.2101, Finance (Budget. I) Department, dated 08-08-2020.

 3. G.O.Rt.No.2207, Finance (Budget. I) Department, dated 22-08-2020.

 4. Gazette Notifications, dated 26-01-2022 & 02-02-2022 on restructuring of districts in Andhra Pradesh.

The Government of Andhra Pradesh, in the references 1st and 2nd read above, have issued orders constituting a State Level Committee (SLC), chaired by Chief Secretary to Government, to study the aspects related to restructuring of the districts and undertake appropriate measures for optimal utilisation of existing resources in the creation of districts and in the reference, 3rd read above, constituted four Sub-Committees (SCs) to assist the SLC in its mandate.

2. In the reference 4th read above, the Government have issued the preliminary Gazette Notifications duly notifying the proposed restructured districts and revenue divisions.

3. The Government has decided that the Government Offices in the restructured districts / revenue divisions shall start functioning from the appointed day i.e., the auspicious day of Ugadi (Saturday, 2nd April 2022).

4. The restructuring of districts and revenue divisions inter-alia necessitates the inter-se allocation of the existing human and physical resources on a permanent basis, which requires time.

5. In the interim, to ensure the orderly transition within the stipulated timelines, it is essential to make transitory arrangements for the inter-se allocation of existing posts & personnel to the reorganized districts and revenue divisions well in advance, so that the offices shall be fully functional from the appointed day. Accordingly, the following orders are issued for the provisional allocation of the posts & personnel.

DOWNLOAD G.O 31

Previous
Next Post »
0 Komentar

Google Tags