AP PRC: Don’t Recover from Employees Salary High
Court Interim Orders on PRC
ఏపీ పీఆర్సీ: రికవరీ
లేకుండా జీతాలు: ఏపీ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ - విచారణ
వాయిదా
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలో
పేర్కొన్న విధంగా రికవరీ లేకుండా జీతాలు వెయ్యాలని ప్రభుత్వానికి కోర్టు మధ్యంతర
ఆదేశాలు జారీ చేసింది. జీతాల్లో రికవరీ చేయటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని
ధర్మాసనం పేర్కొంది.
పీఆర్సీపై నియమించిన ఆశుతోష్
మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వలేదని న్యాయవాది రవితేజ వాదనలు వినిపించారు. జీవోల్లో
ఎరియర్స్ కట్ చేయటాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా... ఈ వ్యవహారంలో అనేక అంశాలు
ముడిపడి ఉండటంతో ప్రభుత్వం సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి
విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది.
పీఆర్సీలో జీతాలు తగ్గాయని
హైకోర్టులో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేసిన విషయం
తెలిసిందే.
0 Komentar