Bank Holidays March 2022: మార్చి-2022 నెలలో బ్యాంక్ సెలవుల వివరాలు ఇవే
ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎం కేంద్రాల సేవలు అందుబాటులో ఉన్నా ఇప్పటికీ కొన్ని పనుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిందే. రుణాలు తీసుకోవడం, బంగారం తాకట్టు పెట్టడం, లాకర్ వినియోగించుకోవడం తదితర పనుల కోసం బ్యాంకులను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ పొరపాటున సెలవు దినాల్లో బ్యాంక్‌కు వెళితే.. ఆ రోజు ప్రణాళిక అంతా దెబ్బతింటుంది. కాబట్టి బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేయవో తెలుసుకోవడం ముఖ్యం. అయితే ఆర్‌బీఐ వెలువరించిన సెలవుల జాబితా ప్రకారం.. మార్చి నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. అయితే, ఆయా రాష్ట్రాలను బట్టి సెలవుల్లో మార్పులు ఉంటాయి.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే మార్చి నెలలో మహాశివరాత్రి, హోలీ వంటి ప్రధాన పండగలు ఉన్నాయి. దీంతో ఆయా రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. దీనికి తోడు రెండో, నాలుగో శనివారాలు, నాలుగు ఆదివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. అంటే ఆరు సాధారణ సెలవులు, రెండు పండగ సెలవులు కలుపుకొని తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెలలో 8 రోజులు బ్యాంకులు పనిచేయవు. మిగిలిన రాష్ట్రాల్లో ఆయా స్థానిక పండగలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ తేదీల్లో మార్పులుంటాయి.
బ్యాంకులు పనిచేయని రోజులు..
మార్చి 01 (మంగళవారం) - మహా శివరాత్రి
మార్చి 06 - ఆదివారం
మార్చి 18 (శుక్రవారం) - హోలీ
మార్చి 12 (శనివారం) - రెండో శనివారం
మర్చి 13 - ఆదివారం
మార్చి 20 - ఆదివారం
మార్చి 26 - నాలుగో శనివారం
మార్చి 27 - ఆదివారం
0 Komentar