Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRAOU: Entrance Test for B.Ed. [SE] Programme – 2021-22 – Results Released

 

BRAOU: Entrance Test for B.Ed. [SE] Programme – 2021-22 – Results Released

అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ: బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల – ఫలితాలు విడుదల

======================

UPDATE 12-04-2022

CLICK FOR RESULTS

WEBSITE

======================

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీ: మార్చి 20, 2022

DOWNLOAD HALL TICKETS

======================

డా.బీ.ఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ) - బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ప్రోగ్రామ్‌ వ్యవధి రెండున్నరేళ్లు. గరిష్ఠంగా ఆరేళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో అయిదు సెమిస్టర్లు ఉంటాయి. ఎంట్రెన్స్‌ టెస్ట్‌, కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంగ్లీష్‌, తెలుగు మాధ్యమాల్లో కోర్సు చేయవచ్చు. ఈ ప్రోగ్రామ్‌నకు రిహెబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌సీఐ) గుర్తింపు ఉంది.

తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

స్పెషలైజేషన్‌లు

1. విజువల్‌ ఇంపెయిర్‌మెంట్‌ 

2. హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌

3. ఇంటలెక్చువల్‌ డిజెబిలిటీ

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి  ద్వితీయ శ్రేణి మార్కులతో బీఏ/ బీకాం/ బీఎస్సి/ బీసీఏ/ బీఎస్సీ-హోం సైన్స్‌/ బీబీఎం ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, హ్యుమానిటీస్‌ విభాగాల్లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసినవారు కూడా అర్హులే. సైన్స్‌, మేథమెటిక్స్‌ ప్రధాన సబ్జెక్ట్‌లుగా కనీసం 55 శాతం మార్కులతో బిఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులైనవారూ అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 2021 జూన్‌ 1 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి నిబంధనలు లేవు.

దివ్యాంగుల తల్లిదండ్రులకు, దివ్యాంగులకు, ఆర్‌సీఐ గుర్తింపు ఉన్న డిప్లొమా లేదా డిగ్రీ కోర్సు లు చేసినవారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.

ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/ బీపీటీ/ బీఏఎంఎస్‌/ బీఎల్‌/ ఎల్‌ఎల్‌బీ/బీఫార్మసీ/ బీహెచ్‌ఎంటీ/ బీవీఎస్సీ/ బీఎస్సీ అగ్రికల్చర్‌/ బీఏ లాంగ్వేజెస్‌/ బీఓఎల్‌/ ఇతర ప్రొఫెషనల్‌ కోర్సులు చేసినవారు దరఖాస్తుకు అనర్హులు.

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ వివరాలు: దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు పార్ట్‌లు ఉంటాయి. మొత్తం 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. మొదటి పార్ట్‌లో జనరల్‌ ఇంగ్లీష్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 40 ప్రశ్నలు; రెండో పార్ట్‌లో జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, లాజికల్‌ అండ్‌ అనలిటికల్‌ రీజనింగ్‌, వెర్బల్‌ అండ్‌ అబ్‌స్ట్రాక్ట్‌ రీజనింగ్‌ అంశాలనుంచి 60 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 100.

ముఖ్య సమాచారం

ప్రోగ్రామ్‌ ఫీజు: రూ.30,000

దరఖాస్తు ఫీజు: రూ.600

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2022

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 11, 2022

హాల్‌ టికెట్స్‌ డౌన్‌లోడింగ్‌: మార్చి 16, 2022 నుంచి

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీ: మార్చి 20, 2022

NOTIFICATION

PROSPECTUS

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags