CMAT 2022 - Common Management Admission
Test - Check All the Details Here
ఎన్‌టిఏ-సీమ్యాట్ 2022 – అర్హత, ఎంపిక
విధానం, పరీక్షా విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ
ఉన్నత విద్యా విభాగానికి చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కామన్ మేనేజ్
మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్) 2022 ప్రకటనను విడుదల చేసింది. దీని ద్వారా
మేనేజ్ మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
కామన్ మేనేజ్ మెంట్ ఆడ్మిషన్
టెస్ట్(సీమ్యాట్)-2022
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ
ఉత్తీర్ణత. 2022-23 విద్యాసంవత్సరం ప్రవేశాలు మొదలయ్యేనాటికి పరీక్షా ఫలితాలు
వెలువడిన డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సీమ్యాట్-2022
పరీక్షకు వయసుతో సంబంధం లేదు.
ఎంపిక విధానం: నేషనల్ టెస్టింగ్
ఏజెన్సీ(ఎన్‌టిఏ) కంప్యూటర్ బేస్డ్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ
నిర్వహిస్తోంది.
పరీక్షా విధానం: 2022-23
విద్యాసంవత్సరానికి మేనేజ్ మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో
వివిధ విభాగాలు ఉంటాయి. ఇందులో క్వాంటిటేటివ్ టెక్నిక్ అండ్ డాటా ఇంటర్ ప్రిటేషన్, లాజికల్
రీజనింగ్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, జనరల్
అవేర్నెస్, ఇన్నవేషన్ అండ్ ఆంత్రప్రిన్యూర్ షిప్ అంశాలు
ఉంటాయి. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలుంటాయి.
ఒక్కోదానికి 4 మార్కులు చొప్పున 400 మార్కులకు దీన్ని నిర్వహిస్తారు. దీనికి
నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ పురుష
అభ్యర్థులకు- రూ. 2000, జనరల్ స్ట్రీ అభ్యర్థులకు- రూ.1000,
ఇతర స్త్రీ, పురుష అభ్యర్థులు రూ.1000
చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 16.02.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది:
17.03.2022.
పరీక్ష తేది: వెల్లడించాల్సి ఉంది.
0 Komentar