DRDO Scholarship Scheme for Girls 2022 –
Details Here
డిగ్రీ స్థాయిలో ఏడాదికి రూ.1,20,000
పీజీ స్థాయిలో ఏడాదికి రూ.1,86,000
డీఆర్‌డీఓ (డిఫెన్స్ ఆర్ అండ్
డిఆర్గనైజేషన్) స్కాలర్‌షిప్: ఆర్థిక సమస్యల కారణంగా ఇంజినీరింగ్
చదవలేని విద్యార్థినులకు DRDO చేయూతను అందిస్తోంది. దరఖాస్తు
ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఎవరు అర్హులు:
ఏరోస్పేస్ ఇంజినీరింగ్/ ఏరోనాటికల్ ఇంజినీరింగ్/ స్పేస్ ఇంజినీరింగ్ అండ్ రాకెటరీ/ ఏవియానిక్స్/ ఏర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ చదువుతోన్న డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు స్కాలర్‌షిప్ పొందడానికి అర్హులు. డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లు
డిగ్రీ: డిగ్రీ స్థాయిలో 20
స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. భారతీయ విద్యార్థినులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి
అర్హులు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ మొదటి
సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ (మెయిన్)లో మేలైన స్కోర్
సాధించి ఉండాలి. ఏడాదికి రూ.1,20,000 చొప్పున నాలుగేళ్లకు
స్కాలర్‌షిప్ ఇస్తారు. లేదా వార్షికఫీజు.. ఏది తక్కువగా ఉంటే అది చెల్లిస్తారు.
పీజీ: పీజీ స్థాయిలో 10
స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. భారతీయ విద్యార్థినులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ ఇంజినీరింగ్ చదువుతున్నవారై
ఉండాలి. బీఈ/బీటెక్/బి.ఇంజినీరింగ్ డిగ్రీలో 60 శాతం
మార్కులు పొంది ఉండాలి. గేట్‌లో మేలైన స్కోర్ సాధించాలి. ఏడాదికి రూ.1,86,000 స్కాలర్‌షిప్‌ను రెండేళ్ల కాలానికి చెల్లిస్తారు. లేదా నెలకు రూ.15,500 చొప్పున చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతోపాటు ఇటీవలి పాస్‌పోర్ట్ సైజ్ కలర్‌ఫొటో, ఆధార్,
ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్, ఫీజు వివరాలు...
మొదలైనవి అప్‌లోడ్ చేయాలి. పూర్తి వివరాలతో నింపకపోయినా, సంబంధిత
పత్రాలను జతపరచకపోయినా దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎలాంటి
కరస్పాండెన్స్‌కూ అవకాశం ఉండదు. స్కాలర్‌షిప్‌ల మంజూరుకు సంబంధించి ఏ దశలోనూ
ఎలాంటి ఫీజూ చెల్లించనవసరం లేదు. ప్రతిభ ఆధారంగానే అర్హులైన విద్యార్థినులను
ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: 31.03.2022
0 Komentar