Gmail to get ‘Integrated View’ from
February 8: Here’s what will be new
ఫిబ్రవరి 8
నుంచి కొత్త లుక్‌లో జీమెయిల్ - ఇంటిగ్రేటెడ్ వ్యూ’ పేరుతో మార్పులు
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జీమెయిల్ సేవలను ఉపయోగిస్తుంటారు. అంతేకాదు ఒక్క జీమెయిల్ ఖాతాతో గూగుల్‌కు సంబంధించిన అన్ని రకాల సేవలనూ పొందొచ్చు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించాలంటే జీమెయిల్ తప్పనిసరి. త్వరలో జీమెయిల్ కొత్త లుక్‌లో దర్శనమివ్వనుంది. గూగుల్ సంస్థ జీమెయిల్ లేఅవుట్‌లో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. గూగుల్‌కు సంబంధించిన జీమెయిల్, గూగుల్ చాట్, గూగుల్ మీట్ వంటి సేవలను ఒకే చోట సులువుగా ఉపయోగించుకునేలా ‘ఇంటిగ్రేటెడ్ వ్యూ’ పేరుతో ఈ మార్పులు చేయనుందని టెక్ వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి 8 నుంచి కొత్త లుక్‌లో జీమెయిల్ యూజర్లకు దర్శనమివ్వనున్నట్లు సమాచారం. ఒకవేళ యూజర్లకు కొత్త జీమెయిల్ లేఅవుట్ నచ్చకుంటే పాత వెర్షన్‌లో కొనసాగవచ్చు. అయితే ఏప్రిల్ తర్వాత మాత్రం యూజర్స్ తప్పనిసరిగా కొత్త వెర్షన్ ఉపయోగించేలా పూర్తి స్థాయిలో గూగుల్ మార్పులు చేయనుందట. ప్రస్తుతం ఉన్నట్లుగా జీమెయిల్ చాట్ వంటి సేవలకు సంబంధించిన ఐకాన్‌లను జీమెయిల్‌లో కుడి వైపు పిన్ చేసుకోవడం సాధ్యపడదు. వాటిని జీమెయిల్‌లో ఎడమవైపు సైడ్ బార్ మెనూలో డీఫాల్ట్‌గా ఇవ్వనుంది.
యూజర్స్ ఇంటిగ్రేటెడ్ వ్యూ ఫీచర్‌ను
ఎనేబుల్ చేసిన తర్వాత ఇన్‌బాక్స్, చాట్స్, మీటింగ్స్ కోసం ప్రత్యేకంగా ట్యాబ్స్ ఓపెన్ చేయాల్సిన అవసరంలేదు.
జీమెయిల్ ఓపెన్ చేసిన పేజీ నుంచే వీటిని ఉపయోగించవచ్చు. అయితే ఇంటిగ్రేటెడ్ వ్యూ
మెనూను గూగుల్ వర్క్‌స్పేస్, జీ సూట్ బేసిక్, బిజినెస్ యూజర్లకు ముందుగా అందుబాటులోకి తీసుకురానున్నారు. తర్వాత సాధారణ
యూజర్లకు ఈ సేవలను పరిచయం చేయనునట్లు సమాచారం. వీటితోపాటు గూగుల్ కొత్త సెర్చ్‌బార్
ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీని సాయంతో యూజర్స్ మెయిల్‌తోపాటు, చాట్ సంభాషణల్లోని సమాచారాన్ని వెతకొచ్చు. పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను
త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.
0 Komentar