Google Chrome: Check These Five New Features
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కొత్త
అప్‌డేట్‌లో వచ్చిన కొత్త ఫీచర్లు ఇవే
డెస్క్‌టాప్‌లలో వెబ్ బ్రౌజింగ్‌కు
సంబంధించి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. కారణం కొత్త
ఫీచర్లు,
బగ్ పరిష్కారాలతో క్రోమ్ బ్రౌజర్ ఎప్పుటిపప్పుడు అప్‌డేట్‌గా
ఉండటమే. అయితే, క్రోమ్ బ్రౌజర్ కొత్త అప్‌డేట్‌లో గూగుల్
మరిన్ని యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు తీసుకొచ్చింది. వాటిని ఒక్కసారి చూద్దాము.
1. బ్యాక్‌గ్రౌండ్ మార్చేయండి (Customize Theme):
క్రోమ్ వెబ్ బ్రౌజర్‌లో బ్యాక్‌గ్రౌండ్, కలర్,
థీమ్ మార్చడానికి గూగుల్ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి
తెచ్చింది. ఇందుకు ముందుగా కొత్త ట్యాబ్ (new tab) ఓపెన్
చేసి కిందన కుడివైపు క్రింద ఉన్న కస్టమైజ్ (Customize) ఫీచర్‌పై
క్లిక్ చేయండి. ఆపై మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్, థీమ్,
కలర్‌ను సెట్ చేసుకోండి.
2. హిస్టరీ ‘జర్నీస్’
(Chrome History ‘Journeys’)
(Ctrl+H) for Chrome History
వెబ్ హిస్టరీ నిర్వహణ కోసం బ్రౌజర్‌లో ‘జర్నీస్ (Journeys)’ పేరిట గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. క్రోమ్‌లో వెతికిన సైట్‌లు, సంబంధిత పదాలు, అంశాల వారీగా హిస్టరీని ఈ ఫీచర్ ఒక గ్రూప్‌గా మారుస్తుంది. ఈ మేరకు ఏఏ సైట్లతో మీరు ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యారో జర్నీస్ పరిగణనలోకి తీసుకుంటుంది. తద్వారా మునుపటి శోధనలను తిరిగి వేగంగా ప్రారంభించడానికి ఈ జర్నీస్ ఫీచర్ సహాయపడుతుంది. ఈ నిర్వహణ ఇష్టలేనట్లయితే జర్నీస్ ఫీచర్‌ని పూర్తిగా ఆఫ్ చేసుకోవచ్చు. వెబ్ హిస్టరీలోకి వెళితే ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఇంతకుంటే ముందుగా క్రోమ్ వెబ్ బ్రౌజర్‌ను మీరు అప్‌డేట్ చేసుకున్నారో లేదో ఓసారి చెక్ చేసుకోండి.
3. హైలైట్ అండ్ షేర్
(Highlight and Share Link)
వెబ్‌పేజీలో ఏదైనా నిర్దిష్టమైన
టెక్స్ట్‌ను హైలైట్ చేస్తూ లింక్ షేర్ చేసేలా ‘లింక్ షేరింగ్’ ఫీచర్‌ను
గూగుల్ పరిచయం చేసింది. ఇందుకు ముందుగా మీరు హైలైట్ చేయాలనుకుంటున్న టెక్స్ట్‌ను
సెలెక్ట్ చేయండి. ఆపై రైట్-క్లిక్ చేసి ‘Copy link to highlight’పై
క్లిక్ చేయండి. ఆపై కాపీ చేసిన సంబంధిత లింక్‌ను ఇతరులతో పంచుకోండి.
4. ట్యాబ్ సెర్చ్
(Chrome Tab Search)
గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లోని మరొ
కొత్త ఫీచరే ‘ట్యాబ్ సెర్చ్’. ఎక్కువ ట్యాబ్‌లు ఓపెన్ చేసినప్పుడు మనకు కావాల్సిన
ట్యాబ్‌ను కనిపెట్టడం కొన్నిసార్లు కష్టమే. తాజాగా క్రోమ్ తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో
ఇక అలా కష్టపడాల్సిన పనిలేదు. ఎన్ని ట్యాబ్‌లు ఓపెన్ చేసిన మీకు కావాల్సిన ట్యాబ్‌ను
సెర్చ్ చేయడానికి ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగపడుతుంది. క్రోమ్ విండో ఎగువన ట్యాబ్
చివరన ఉన్న ఫీచర్‌లో కీవర్డ్‌ను ఎంటర్ చేసి ట్యాబ్‌ను సెర్చ్ చేయవచ్చు. లేదంటే Ctrl+Shift+A షార్ట్‌కట్ వాడొచ్చు.
5. కొత్త విడ్జెట్‌లు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం క్రోమ్ కొత్త విడ్జెట్‌లను తీసుకొచ్చింది. వీటితో నేరుగా మీరు హోమ్‌స్క్రీన్ నుంచే టెక్స్ట్, లెన్స్, ఇన్‌కాగ్నిటో, వాయిస్ సెర్చ్‌లు చేయవచ్చు. ఈ విడ్జెట్‌లను ప్రారంభించడానికి క్రోమ్ ఆండ్రాయిడ్ యాప్‌ను కాసేపు క్లిక్ చేసి ఉండండి. ఆపై విడ్జెట్‌లను యాడ్ చేసుకోండి.
వీటితో పాటే నిర్దిష్టమైన ట్యాబ్‌లో ఆడియోను మ్యూట్ చేసేలా, న్యూ డౌన్‌లోడ్స్ కోసం షార్ట్‌కట్ తీసుకొచ్చేలా గూగుల్ కొత్త ఫీచర్లు తీసుకురానుంది.
0 Komentar