GPAT 2022 - Graduate Pharmacy Aptitude
Test - Check All the Details Here
ఎన్టీఏ-జీప్యాట్ 2022 - అర్హత, ఎంపిక విధానం, పరీక్షా
విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)
గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్) 2022 ప్రకటనను విడుదల చేసింది. దీని ద్వారా ఎంఫార్మా/ తత్సమాన కోర్సుల్లో
ప్రవేశాలు కల్పిస్తారు.
గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్
టెస్ట్ (జీప్యాట్) 2022
అర్హత: ఇంటర్మీడియట్ తర్వాత
ఫార్మసీలో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ తత్సమాన ఉత్తీర్ణత. 2022-23 విద్యాసంవత్సరం ప్రవేశాలు మొదలయ్యేనాటికి బ్యాచిలర్స్ డిగ్రీ బీఫార్మసీ
పరీక్షా ఫలితాలు వెలువడిన చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
బీటెక్ (ఫార్మస్యూటికల్, ఫైన్ కెమికల్ టెక్నాలజీ)/ తత్సమాన
అభ్యర్థులు దీనికి అర్హులు కాదు. జీప్యాట్-2022 దరఖాస్తుకు
వయసుతో సంబంధం లేదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
టెస్ట్,
గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పరీక్షా విధానం: 2022-23 విద్యాసంవత్సరానికి మాస్టర్స్(ఎంఫార్మా) కోర్సుల్లో ప్రవేశానికి
నిర్వహించే పరీక్షలో వివిధ విభాగాలు ఉంటాయి. ఇందులో 125 ప్రశ్నలుంటాయి.
ఒక్కోదానికి 4 మార్కులు చొప్పున 500 మార్కులకు
దీన్ని నిర్వహిస్తారు. దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు
సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ పురుష
అభ్యర్థులకు- రూ. 2000, జనరల్ స్త్రీ అభ్యర్థులకు- రూ.1000,
ఇతర స్త్రీ పురుష అభ్యర్థులు రూ.1000
చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 16.02.2022.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 17.03.2022.
పరీక్ష తేది: వెల్లడించాల్సి ఉంది.
0 Komentar