Hero Electric ties up with State Bank of
India for retail finance
హీరో ఎలక్ట్రిక్ వినియోగదారులకు శుభవార్త:
రిటైల్ ఫైనాన్స్ కోసం ఎస్‌బీఐతో ఒప్పందం – వివరాలు ఇవే
వినియోగదారులకు రిటైల్ రుణాలు
అందించేందుకు వీలుగా ప్రముఖ విద్యుత్తు వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్..
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐతో చేతులు కలిపింది. తక్కువ వడ్డీరేటుకు, ఎలాంటి
చిక్కులు లేకుండా ఇకపై హీరో ఎలక్ట్రిక్ వాహనాల (EV)ను సొంతం
చేసుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. విద్యుత్తు వాహనాలకు గిరాకీ
పుంజుకుంటున్న నేపథ్యంలో వినియోగదారులకు సహాయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు
తెలిపింది. ఈవీలను కొనుగోలు చేయాలనుకుంటున్నవారు ఆకర్షణీయమైన ఆఫర్లు, పథకాల కోసం చూస్తున్నారని అభిప్రాయపడింది.
దీనిపై ఎస్‌బీఐ చీఫ్ జనరల్
మేనేజర్ దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ... భారత్‌ను స్వచ్ఛ ఇంధనం వైపు నడపడంలో తమ
వంతు కృషిగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తక్కువ ఈఎంఐలతో విద్యుత్తు వాహనాలు
ప్రజలకు మరింత అందుబాటు ధరల్లో చేరువ కానున్నాయన్నారు.
We have now partnered with SBI for E-2W loans to make your EV journey more affordable and convenient. This partnership will empower you to choose one of the most trusted electric vehicle financing solution, supporting the EV revolution in India. https://t.co/G7CadTZqtw
— Hero Electric (@Hero_Electric) February 10, 2022
0 Komentar