India Post Payments Bank Cuts Savings
Account Interest Rate: Check Latest Rates
పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ - డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు – వివరాలు ఇవే
ఫిబ్రవరి 1,
2022 నుంచి పోస్టల్‌కు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్
బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల్లో ఉన్న డిపాజిట్లకు వడ్డీ రేటు మారింది. ప్రస్తుతం రూ.లక్ష
వరకు ఈ సేవింగ్స్ ఖాతాలో నగదు ఉంటే 2.50% వడ్డీ వచ్చేది.
అయితే, దీన్ని 2.25 శాతానికి
సవరించారు. రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల
వరకు బ్యాలెన్స్‌పై ప్రస్తుత రేటు 2.75 శాతం ఉంటే... దీన్ని 2.5 శాతానికి తగ్గించారు.
రోజువారీ ముగింపు బ్యాలెన్స్‌పై
వడ్డీని లెక్కిస్తారు. 3 నెలలకోసారి ఖాతాలో జమ చేస్తారు. అయితే,
వాణిజ్య బ్యాంకుల కన్నా పోస్టల్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎక్కువ
ఉంటాయి. కానీ స్టేట్ బ్యాంకుకు చెందిన సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో రూ.1 లక్ష వరకు డిపాజిట్లపై 2.70% వరకు వడ్డీ రేటు
ఉంది. (వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. మీరు బ్యాంకును సంప్రదించడం
మేలు). ఇది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు కన్నా
ఎక్కువ.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు
అనేది చెల్లింపుల బ్యాంకు. దీనిలో గరిష్ఠ నగదు బ్యాలెన్స్ రూ.1
లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెంచారు. సాధారణ పొదుపు
ఖాతాతో పాటు, ఐపీపీబీ మొబైల్ యాప్ ద్వారా ఐపీపీబీ డిజిటల్
సేవింగ్స్ ఖాతాను కూడా తెరవొచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ప్లే
స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్ వినియోగదారుల కోసం యాప్ స్టోర్‌లో
కూడా అందుబాటులో ఉంటుంది. ఆధార్, పాన్ కార్డ్ కలిగి ఉన్న 18 ఏళ్లు పైబడిన ఎవరైనా ఈ ఖాతాను తెరవొచ్చు.
0 Komentar