Indian Bank Security Guard Recruitment
2022: Apply for 202 Posts – Details Here
ఇండియన్ బ్యాంక్ లో 202 సెక్యూరిటీ
గార్డులు – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన
చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా కింది పోస్టుల
భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది.
సెక్యూరిటీ గార్డులు
మొత్తం ఖాళీలు: 202
అర్హత: పదో తరగతి/ తత్సమాన
ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు ఎక్స్ సర్వీసెమెన్ (ఆర్మీ/ నేవీ/ ఎయిర్ ఫోర్స్) అయి
ఉండాలి.
వయసు: 26 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్
టెస్ట్ (ఆన్లైన్), టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, వాలిడ్ డ్రైవింగ్
లైసెన్స్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ఆన్లైన్ టెస్ట్: ఈ పరీక్షని మొత్తం
40 మార్కులకి నిర్వహిస్తారు. పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది. దీనికి నెగిటివ్
మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.
1) జనరల్ నాలెడ్జ్ / అర్థమేటిక్
అండ్ రీజనింగ్: 20 ప్రశ్నలు - 10 మార్కులు - 30 నిమిషాలు
2) బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్: 20
ప్రశ్నలు - 10 మార్కులు - 30 నిమిషాలు
3) సెక్యూరిటీ అంశాలపై నాలెడ్జ్:
20 ప్రశ్నలు - 10 మార్కులు- 30 నిమిషాలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 23.02.2022.
దరఖాస్తులకు చివరి తేది:
09.03.2022.
0 Komentar