IPL-2022: BCCI Unveils New Format For
2022, With Two Groups and Seedings
ఐపీఎల్ 2022 : పది జట్లు - రెండు గ్రూపులు - సీడింగ్‌లతో కొత్త
ఫార్మాట్‌ను వివరాలు ఇవే
క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న
15వ సీజన్ టాటా ఐపీఎల్ పోటీల వివరాలను బీసీసీఐ ప్రకటించింది. కొవిడ్
నేపథ్యంలో విమాన ప్రయాణాల్ని నివారించేలా రెండు నగరాల్లోని నాలుగు మైదానాల్లోనే
జరుగుతాయని వెల్లడించింది. ఈ మేరకు నిన్న జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశ
వివరాలను ఐపీఎల్ మీడియా అడ్వైజరీ ప్రకటించింది. ఐపీఎల్ మెగా టోర్నమెంట్ మార్చి 26న ప్రారంభమవుతుంది. మే 29వ తేదీన ఫైనల్ మ్యాచ్
జరుగుతుంది. అయితే, ఈ మ్యాచ్‌ల తేదీలు, ఎప్పుడు ఎక్కడ జరుగుతాయనే వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది.
మొత్తం ఎన్ని మ్యాచ్‌లు..?
ఈసారి పది జట్లు తలపడబోయే ఐపీఎల్‌లో
70 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని ఐపీఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు. మరో నాలుగు
ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. ఐపీఎల్ ఛాంపియన్‌షిప్‌ను ఏ జట్టు ఎన్నిసార్లు
గెలుచుకుంది, ఏ జట్టు ఎన్నిసార్లు ఫైనల్‌కు చేరుకుందనే
వివరాలను దృష్టిలో పెట్టుకుని పది జట్లను రెండు వర్చువల్ గ్రూప్‌లుగా విభజించారు.
ప్రతి జట్టూ 14 లీగ్ మ్యాచ్‌లను ఆడాలి. ఏడు సొంత మైదానంలో,
మరో ఏడు బయట స్టేడియాల్లో ఆడాల్సి ఉంటుంది. అలాగే, ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్‌లను వాంఖడే, డీవై
పాటిల్ మైదానాల్లోనూ.. మూడేసి మ్యాచ్‌లను సీసీఐ (ముంబయి), ఎంసీఏ
అంతర్జాతీయ స్టేడియాల్లో (పుణె) ఆడాలి. వాంఖడే స్టేడియంలో 20
మ్యాచ్‌లు, సీసీఐ మైదానంలో 15, డీవై
పాటిల్ స్టేడియంలో 20, పుణె ఎంసీఏ మైదానంలో 15 మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో జట్టుకు సొంతమైదానం ఏదనేది నిర్ణయించాల్సి
ఉంది.
ఏ జట్టు ఏ గ్రూప్‌లో...?
పది జట్లను వాటి ప్రదర్శన ఆధారంగా
రెండు గ్రూప్‌లుగా విభజించింది. గ్రూప్-Aలో ముంబయి ఇండియన్స్,
కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్,
దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్
ఉన్నాయి. ఇక గ్రూప్-Bలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్
బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్
టైటాన్స్ జట్లకు స్థానం దక్కింది. ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని టీమ్‌తో రెండేసి
మ్యాచ్‌లను ఆడాలి. ఇక రెండో గ్రూప్‌లోని ఓ జట్టుతో రెండు మ్యాచ్‌లు, మిగతా టీమ్స్‌తో ఒక్కో మ్యాచ్‌ను ఆడాల్సి ఉంటుంది.
ఉదాహరణకు.. ఎస్ఆర్‌హెచ్‌ను
తీసుకుంటే.. ఈ జట్టు గ్రూప్-బిలో ఉంది. ఇక్కడ ఉన్న సీఎస్‌కే, ఆర్‌సీబీ,
పీబీకేఎస్, గుజరాత్‌తో రెండేసి మ్యాచ్‌లను
ఆడుతుంది. గ్రూప్-ఏలోని కేకేఆర్‌తో రెండు మ్యాచ్‌లు.. ముంబయి, ఆర్ఆర్, డీసీ, ఎల్‌ఎస్‌జీతో
ఒక్కో మ్యాచ్‌ను ఆడాలి.
0 Komentar