Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPL Mega Auction 2022 - All You Wanted to Know About the IPL 2022 Auction

 

IPL Mega Auction 2022 - All You Wanted to Know About the IPL 2022 Auction

ఐపీఎల్‌ మెగా వేలం -2022.. ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత సొమ్ముంది? ఎన్ని స్లాట్‌లు ఉన్నాయి? రిటెయిన్‌ చేసుకున్న ఆటగాళ్లు వీరే!

ఐపీఎల్- 2022 మెగా వేలం కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. రెండ్రోజులపాటు జరిగే మెగా వేలం శనివారం (ఫిబ్రవరి 11)  ఉదయం 11 గంటలకు బెంగళూరు వేదికగా మొదలు కానుంది. మొత్తం పది ఫ్రాంచైజీలు ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను రిటెయిన్/సెలెక్షన్‌ చేసుకున్నాయి. ఇక దాదాపు 590 మంది క్రికెటర్ల నుంచి తమకు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. దీని కోసం అన్ని ఫ్రాంచైజీలు దాదాపు రూ.560 కోట్లకుపైగా సొమ్మును ఖర్చు చేయనున్నాయి.

అత్యధికంగా పంజాబ్‌ కింగ్స్‌ వద్ద రూ.72 కోట్లు ఉండగా.. దిల్లీ క్యాపిటల్స్‌ వద్ద తక్కువగా రూ.47.5 కోట్లు ఉన్నాయి. ఒక్కో జట్టు గరిష్ఠంగా 25 ఆటగాళ్లను కలిగి ఉండాలి. కొన్ని ఫ్రాంచైజీలు ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని రిటెయిన్‌ చేసుకోగా.. మిగిలిన వారిని వేలంలో దక్కించుకుంటాయి. మరి ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకున్నాయి? ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత సొమ్ము ఉంది? ఎన్ని స్లాట్‌లు ఉన్నాయో తెలుసుకుందాం..

 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)

రిటెయిన్‌ చేసుకున్న ఆటగాళ్లు: ఎంఎస్‌ ధోనీ, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్‌ గైక్వాడ్‌

ఖాళీ స్లాట్‌లు: 21

మిగిలి ఉన్న నగదు: రూ.48 కోట్లు

 

దిల్లీ క్యాపిటల్స్‌ (DC)

రిటెయిన్‌ ఆటగాళ్లు: రిషభ్ పంత్, అక్షర్‌ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్‌ నార్జ్‌

ఖాళీ స్లాట్‌లు: 21

మిగులు నగదు: 47.5 కోట్లు         

 

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR)

రిటెయిన్‌ ఆటగాళ్లు: ఆండ్రూ రస్సెల్‌, వరుణ్‌ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్, సునిల్ నరైన్

ఖాళీ స్లాట్‌లు: 21

మిగులు నగదు: రూ.48 కోట్లు      

 

ముంబయి ఇండియన్స్ (MI) 

రిటెయిన్‌ ఆటగాళ్లు: రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, కీరన్‌ పొలార్డ్

ఖాళీ స్లాట్‌లు: 21

మిగులు నగదు: రూ. 48 కోట్లు

 

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ (LSG)

రిటెయిన్‌ ఆటగాళ్లు: కేఎల్ రాహుల్, మార్కస్ స్టొయినిస్, రవి బిష్ణోయ్‌

ఖాళీ స్లాట్‌లు: 22

మిగులు నగదు: రూ.59 కోట్లు

 

పంజాబ్‌ కింగ్స్ (KXIP)

రిటెయిన్‌ ఆటగాళ్లు: మయాంక్‌ అగర్వాల్, అర్షదీప్ సింగ్

ఖాళీ స్లాట్‌లు: 23

మిగులు నగదు: రూ. 72 కోట్లు

 

రాజస్థాన్‌ రాయల్స్ (RR)

రిటెయిన్‌ ఆటగాళ్లు: సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్

ఖాళీ స్లాట్‌లు: 22

మిగులు నగదు: రూ.62 కోట్లు

 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

రిటెయిన్‌ ఆటగాళ్లు: విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్

ఖాళీ స్లాట్‌లు: 22

మిగులు నగదు: రూ. 57 కోట్లు     

 

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH)

రిటెయిన్‌ ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్

ఖాళీ స్లాట్‌లు: 22

మిగులు నగదు: రూ.68  కోట్లు

 

గుజరాత్‌ టైటాన్స్‌ (GT)

రిటెయిన్‌ ఆటగాళ్లు: హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్

ఖాళీ స్లాట్‌లు: 22

మిగులు నగదు: రూ.52 కోట్లు

Previous
Next Post »
0 Komentar

Google Tags