ITR Verification: Check the Last Date to
Verify ITR for AY 2020-21
ఫిబ్రవరి 28
లోగా రిటర్నులను ఇ వెరిఫై చేసుకోండి
- ఆదాయపు పన్ను విభాగం సూచన
ఆర్థిక సంవత్సరం 2019-20కి గాను (2020-21 మదింపు సంవత్సరం) దాఖలు చేసి,
ఇ-వెరిఫై చేసుకోని వారు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదాయపు
పన్ను విభాగం సూచించింది. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసిన 120 రోజుల్లో ఇ-వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.
గత రెండేళ్లుగా కరోనా పరిస్థితులు
ఉండటంతో ఎంతోమంది రిటర్నుల ఇ-వెరిఫైని పట్టించుకోలేదు. దీంతో ఐటీ విభాగం ఈ ఏడాది
ఫిబ్రవరి 28 వరకు వ్యవధినిచ్చింది. ఈ వెసులుబాటును
ఉపయోగించుకోవాలని తెలిపింది. ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్,
బ్యాంకు ఖాతా/డీమ్యాట్ ద్వారా ఈవీసీ ద్వారా ఇ-వెరిఫై చేసుకునేందుకు
వీలుంది. లేకపోతే.. సీపీసీ బెంగళూరుకు అక్నాలడ్జ్‌మెంట్‌ను పంపించాలి. లేకపోతే
రిటర్ను సమర్పించినప్పటికీ, అది చెల్లదు.
Don’t miss the final chance to verify your ITR for AY 2020-21.
— Income Tax India (@IncomeTaxIndia) February 26, 2022
Pl note that the ITR can be verified by several modes.
The last date for verification is 28th February, 2022.
Pl visit: https://t.co/GYvO3mStKf #ITR #VerifyNow pic.twitter.com/llkfxoppf3
0 Komentar