KVS Admissions 2022-23 - All the Details Here
కేంద్రీయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల పూర్తి వివరాలివే
=================
UPDATE 30-04-2022
1 వ తరగతి అడ్మిషన్ల కి సంబంధించి
తొలి జాబితా విడుదల
CLICK HERE FOR SELECT / WAIT LIST FOR 1st CLASS
=================
UPDATE 28-04-2022
1 వ తరగతి అడ్మిషన్ల
సవరించిన షెడ్యూల్ విడుదల – మూడు జాబితాల విడుదల తేదీలు ఇవే
తొలి జాబితా విడుదల తేదీ: ఏప్రిల్
29,
2022
రెండో జాబితా విడుదల తేదీ: మే 6, 2022
మూడో జాబితా విడుదల తేదీ: మే 8, 2022
REVISED
SCHEDULE FOR FIRST CLASS
=================
UPDATE 27-04-2022
KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాల్లో ఎంపీ కోటా రద్దు - సవరించిన మార్గదర్శకాలు విడుదల - కొవిడ్ అనాథలకు ప్రత్యేక ప్రవేశాలు
=================
UPDATE 24-04-2022
LIST OF REGISTERED, SELECTED AND
WAITLISTED CANDIDATES FOR ADMISSION TO CLASSES II TO IX
2వ తరగతి నుండి 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం రిజిస్టర్ అయిన, ఎంపిక చేయబడిన మరియు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థుల జాబితా ఇదే
EXAMPLE WE HAVE TAKEN ONGOLE KVS (PRAKASAM): 👇👇👇
ALL THE LIST FROM CLASSES
II TO IX
ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసి మీ
పిల్లలు ఏ పాఠశాలలో రిజిస్టర్ అయ్యారో ఆ పాఠశాల యొక్క వెబ్సైట్ లింక్ ని తెలుసుకొని, ఆ
తర్వాత ఆ స్కూల్ వెబ్సైట్ లో 2 వ తరగతి నుండి 9 తరగతి వరకు స్కూల్ వారి లిస్ట్ ని ‘Announcements’
లో చూడవచ్చు.
Region is ‘Hyderabad’ for both Telugu
States.
=================
UPDATE 18-04-2022
Kendriya Vidyalaya (KV) Admission 2022: Class 1 – Lottery of
First List is Postponed
కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ 2022: ఒకటో తరగతి ప్రవేశానికి సంబంధించిన తొలి జాబితా విడుదల వాయిదా – వివరాలు ఇవే
కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) 1వ తరగతికి సంబంధించిన KV అడ్మిషన్ ఫస్ట్ లిస్ట్ 2022
విడుదలను తదుపరి ఆర్డర్ వరకు వాయిదా వేసింది.
=================
UPDATE 10-04-2022
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి
ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈనెల 13 వ తేదీ వరకు పొడిగించారు.
ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్
శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి
దరఖాస్తు గడువు షెడ్యూల్ 11 వ తేదీ (సోమవారం) తో ముగియనుంది. అయితే
పలువురి నుంచి వచ్చిన వినతులతో పాటు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు గడువును 13
వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేవీఎస్ పేర్కొంది.
PRESS
NOTE ON EXTENSION OF DATES
=================
UPDATE 21-03-2022
1 వ తరగతి అడ్మిషన్ల
సవరించిన షెడ్యూల్ ఇదే - దరఖాస్తు గడువు పెంపు
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రక్రియ
ప్రారంభం: 28, ఫిబ్రవరి
2022, ఉదయం 10.00గంటల నుండి
దరఖాస్తుల ప్రక్రియ ఆఖరి తేదీ: ఏప్రిల్
11, 13న సాయంత్రం 7 గంటల వరకు
తొలి జాబితా విడుదల తేదీ: ఏప్రిల్
18,
2022
రెండో జాబితా విడుదల తేదీ: ఏప్రిల్
25,
2022
మూడో జాబితా విడుదల తేదీ: మే 2, 2022
APPLICATION
DATE EXTENSION DETAILS
=================
రెండో తరగతి, ఆపై
తరగతుల్లో ప్రవేశాలకు మరియు 11వ తరగతిలో ప్రవేశాల వివరాలు ఇవే
ప్రవేశాలకు గరిష్ఠ వయసు పెంపు - ఒకటో
తరగతికి కనిష్ఠం ఆరేళ్లు, గరిష్ఠం 8 ఏళ్లు
=================
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో
తరగతిలో చేరే విద్యార్థుల కనిష్ఠ, గరిష్ఠ వయసుల్లో మార్పుచేశారు. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశం కోరే వారికి కనిష్ఠంగా ఆరేళ్లు, గరిష్ఠంగా 8 ఏళ్లు ఉండాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్
పేర్కొంది. ఈ రెండు వయసుల మధ్య ఉన్నవారికి మాత్రమే కొత్త విద్యా సంవత్సరంలో
ప్రవేశాలు కల్పిస్తామని, అంతకంటే తక్కువ, ఎక్కువ వయసున్నవారి దరఖాస్తులు అనుమతించబోమని స్పష్టం చేసింది. గతంలో
అయిదు నుంచి ఏడేళ్ల వరకు వయసు ఉన్న పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం ఉండేది.
ఇప్పుడు నూతన జాతీయ విద్యా
విధానాన్ని అనుసరించి కనీస వయసును 6 ఏళ్లకు, గరిష్ఠ వయసును 8 ఏళ్లకు పెంచింది. దివ్యాంగులకు
గరిష్ఠ వయసులో 2 ఏళ్ల సడలింపు ఇచ్చింది. దీని ప్రకారం ఒకటో
తరగతిలో దరఖాస్తు చేసుకొనే పిల్లలు 2014 ఏప్రిల్ 1 నుంచి 2016 ఏప్రిల్ 1 మధ్య
పుట్టినవారై ఉండాలి. దివ్యాంగులైతే 2012 ఏప్రిల్ 1 నుంచి 2016 ఏప్రిల్ 1 మధ్యలో
జన్మించి ఉండొచ్చు. ఒకటో తరగతి ప్రవేశాలకు సోమవారం ఉదయం 10
గంటల నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని కేంద్రీయ విద్యాలయ సంఘటన్
తెలిపింది. మార్చి 21వ తేదీ సాయంత్రం 7
గంటలవరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వెల్లడించింది. మార్చి 25న తొలి, ఏప్రిల్ 1న రెండు,
ఏప్రిల్ 8న మూడో ఎంపిక జాబితా ప్రచురిస్తామని
తెలిపింది.
=================
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం: 28, ఫిబ్రవరి 2022, ఉదయం 10.00గంటల నుండి
దరఖాస్తుల ప్రక్రియ ఆఖరి తేదీ: మార్చి 21న
సాయంత్రం 7 గంటల వరకు
తొలి జాబితా విడుదల తేదీ: మార్చి 25, 2022
రెండో జాబితా విడుదల తేదీ: ఏప్రిల్
1, 2022
మూడో జాబితా విడుదల తేదీ: ఏప్రిల్
8, 2022
=================
* రెండో తరగతి, ఆపై
తరగతుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
* 11వ తరగతిలో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ పత్రాలను కేంద్రీయ విద్యాలయ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
KVS
Admission Schedule 2022-23
KVS
Admission Guidelines 2022-23
0 Komentar