Maruti Suzuki Baleno-2022 Launched in
India – Price and Important Details Here
మారుతీ సుజుకీ సరికొత్త బాలెనో భారత్‌లోకి
సరికొత్త బాలెనో – ధర మరియు కొత్త ప్రత్యేకతల వివరాలు ఇవే
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ
సుజుకీ సరికొత్త బాలెనో వాహనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కారు లుక్స్‌లో
స్వల్పమార్పులు చేసింది. యాంగ్యూలర్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ
డీఆర్‌ఎల్‌ల వంటి హంగులు కనిపించాయి. ముఖ్యంగా కారులోపల, టెక్
విభాగాల్లో కీలక మార్పులు చేసింది.
దీని ధరలు బేస్ సిగ్మా వేరియంట్
కోసం ₹
6.35 లక్షల నుండి ప్రారంభమవుతాయి మరియు టాప్-ఎండ్ ఆల్ఫా ఆటోమేటిక్
ట్రిమ్ కోసం ₹ 9.49 లక్షల వరకు ఉన్నాయి.
సరికొత్త బాలెనోలో క్యాబిన్
లేఅవుట్‌ను కూడా పూర్తిగా మార్చింది. సరికొత్త డ్యాష్ బోర్డులో 9
అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ యూనిట్‌ను అమర్చారు. ఈ కొత్త కారులో 40 రకాల కార్ కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతోపాటు ఇన్‌బిల్ట్ నేవిగేషన్ సిస్టమ్‌ను కూడా అమర్చారు.
అలెక్సా అసిస్టెన్స్, హెడ్‌అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, 360 వ్యూకెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ ఏసీ వెంట్ వంటివి ఉన్నాయి.
సరికొత్త మారుతీ సుజుకీ బాలెనోలో 1.2లీటర్ వీవీటీ మోటార్
ఇంజిన్, 5స్పీడ్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్, ఆటో ట్రాన్స్‌మిషన్( ఆప్షనల్) ఉన్నాయి.
Spotlight please!
— Nexa Experience (@NexaExperience) February 23, 2022
TAP THE LINK TO WATCH THE FULL VIDEO : https://t.co/FwgBmEMD9e#BookingOpen : https://t.co/BF46afQW4z#TheNewAgeBaleno #TechGoesBold #Nexa #CreateInspire pic.twitter.com/5qW0VCzp1j
It’s bold. It’s tech-loaded. It’s #TheNewAgeBaleno, here to take the world by storm.
— Nexa Experience (@NexaExperience) February 23, 2022
And now, its price is revealed here exclusively.
The price of this bold premium hatchback starts at ₹635000 onwards.#BookingsOpen:https://t.co/BF46afQof1#TechGoesBold #NEXA #CreateInspire pic.twitter.com/AxfSozOl38
0 Komentar