Maharashtra Nanded Farmer Made Electric Bike
to Save Transportation Costs
పాత పెట్రోల్ బైకును విద్యుత్తు
బైకుగా మార్చిన నాందేడ్ జిల్లా రైతు - రూ.14 ఖర్చుతో 100 కి.మీ. ప్రయాణం
పదో తరగతి చదివిన రైతు సొంతంగా
విద్యుత్తు బైకు రూపొందించాడు. లాక్‌డౌన్ సమయంలో రెండేళ్లు కష్టపడి అనుకున్నది
సాధించాడు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా అర్థాపుర్ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్
రూ.14 ఖర్చుతో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసేలా దీన్ని
చేశాడు.
తనకున్న కొద్దిపాటి భూమిలో పూలు
సాగుచేసే ధ్యానేశ్వర్‌కు రోజూ పూలు మార్కెట్‌కి రవాణా చేసేందుకు రూ.250 అయ్యేది. ఈ ఖర్చు తగ్గించుకోవాలన్న ప్రయత్నంలోనే పాత పెట్రోల్ బైకును
విద్యుత్తుతో నడిచేలా తీర్చిదిద్దాడు.
750 వోల్ట్ కెపాసిటీ
మోటార్, 48 వోల్ట్ బ్యాటరీ, ఛార్జర్,
కంట్రోలర్, లైటు, ఎలక్ట్రిక్
బ్రేక్ అమర్చాడు. దీనికి 4 గంటలు ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఇందుకయ్యే ఖర్చు రూ.14
మాత్రమే. విద్యుత్ బైకు తయారీకి మొత్తం రూ.40 వేలు అయినట్టు
ధ్యానేశ్వర్ చెప్పాడు. తగిన సహకారం ఉంటే మరిన్ని ప్రయోగాలు చేస్తానని
చెబుతున్నాడు.
0 Komentar