NCHM JEE-2022: National Council for
Hotel Management Joint Entrance Examination-2022 – All the Details Here
ఎన్‌టిఏ-ఎన్‌సీహెచ్ఎం జేఈఈ - నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్ మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2022 – పూర్తి వివరాలు ఇవే
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఏ)
2022 సంవత్సరానికి నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్ మెంట్ జాయింట్ ఎంట్రన్స్
ఎగ్జామినేషన్ (ఎన్ సీ హెచ్ఎం-జేఈఈ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా
2022-2023 సంవత్సరానికి దేశవ్యాప్తంగా బీఎస్సీ (హాస్పిటాలిటీ, హోటల్
అడ్మినిస్టేషన్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్
మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీహెచ్ఎం-జేఈఈ) 2022
అర్హత: ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా
ఇంటర్మీడియట్(10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు
దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.07.2022 నాటికి జనరల్, ఓబీసీ
అభ్యర్థుల గరిష్ఠ వయసు 25 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ, పీడబ్ల్యూడీలకు 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
టెస్ట్(సీబీటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్షా విధానం: ఈ పరీక్ష
మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల(ఎంసీక్యూ) రూపంలో ఉంటుంది. కింద సూచించిన విభాగాల నుంచి
ప్రశ్నలు ఉంటాయి.
* న్యూమరికల్ ఎబిలిటీ అండ్
అనలైటికల్ ఆప్టిట్యూడ్ - 30 ప్రశ్నలు
* రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్
- 30 ప్రశ్నలు
* జనరల్ నాలెడ్జ్ ఆండ్ కరెంట్
అఫైర్స్ - 30 ప్రశ్నలు
* ఇంగ్లిష్ లాంగ్వేజ్ - 60
ప్రశ్నలు
* ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టర్
- 50 ప్రశ్నలు
* మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి.
ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.
దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1మార్కు కోత
విధిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో
ఉంటుంది.
పరీక్షా సమయం 3 గంటలు(180
నిమిషాలు) ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ-
రూ.1000, జనరల్-ఈడబ్ల్యూఎస్-రూ.100, ఎస్సీ/ఎస్టీ/
పీడబ్ల్యూడీరూ.450, ట్రాన్స్ జెండర్-రూ.450 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది:
03.05.2022.
పరీక్ష తేది: 28.05.2022.
0 Komentar