NTPC Limited Recruitment 2022: Apply for
177 Posts - Details Here
ఎన్టీపీసీలో 177 పోస్టులు – అర్హత, ఎంపిక విధానం, జీతభత్యాలు మరియు దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వరంగానికి చెందిన
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ), ఝార్ఖండ్
లోని కోల్ మైనింగ్ హెడ్ క్వార్టర్స్ నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 177
1) మైనింగ్ ఓవర్‌మెన్: 74
అర్హత: మైనింగ్ ఇంజినీరింగ్ లో
డిప్లొమా ఉత్తీర్ణత. డీజీఎంఎస్ జారీ చేసిన ఓవర్ మెన్ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత
పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 57 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.50,000
చెల్లిస్తారు
2) మైనింగ్ సిర్దార్: 103
అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. డీజీఎంఎస్ జారీ చేసిన వాలిడ్ సిర్దార్ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 57 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ. 40,000
చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్
టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని
మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో 100 మార్కులకి నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత
సాధించిన అభ్యర్థుల్ని స్కిల్ టెస్ట్ కి పిలుస్తారు. రాత పరీక్షలో సాధించిన మెరిట్
మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేది: 24.01.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:
15.03.2022.
0 Komentar