RBI Assistant Recruitment 2022: Apply
for 950 Posts – Details Here
ఆర్‌బీఐలో 950 అసిస్టెంట్లు - అర్హత, ఎంపిక విధానం దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వానికి చెందిన
సెంట్రల్ బ్యాంక్, రెగ్యులేటరీ సంస్థ అయిన ముంబయి
ప్రధానకేంద్రంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దేశవ్యాప్తంగా కింది
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్లు
మొత్తం ఖాళీలు: 950
అర్హత: కనీసం 50
శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 01.02.2022 నాటికి 20 - 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02/02/1994
- 01/02/2002 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్
ఎగ్జామినేషన్ (ప్రిలిమినరీ, మెయిన్స్), లాంగ్వేజ్
ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: ప్రిలిమినరీ
పరీక్షని మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 60
నిమిషాలు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అర్హత
సాధించిన అభ్యర్థుల్ని మెయిన్ ఎగ్జామినేషన్ కి ఎంపిక చేస్తారు.
మెయిన్ ఎగ్జామ్ మొత్తం 200 మార్కులకు
నిర్వహిస్తారు. పరీక్ష సమయం 135 నిమిషాలు ఉంటుంది.
ప్రిలిమినరీ, మెయిన్
ఎగ్జామినేషన్లో అర్హత సాధించిన అభ్యర్థుల్ని లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధా
రంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 17.02.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 08.03.2022.
ప్రిలిమినరీ ఆన్లైన్ పరీక్ష
తేదీలు: 2022,
మార్చి 26, 27.
0 Komentar