RIMC January-2023
Term: Entrance Examination for Admission of Boys & Girls Students – Details
Here
ఏపీపీఎస్సీ-ఆర్‌ఐఎంసి లో ఎనిమిదో
తరగతి ప్రవేశాలు - జనవరి 2023 టర్మ్ ప్రవేశ పరీక్ష వివరాలు ఇవే
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ
శాఖకు చెందిన డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్‌ఐఎంసి)లో
జనవరి 2023 టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన బాలుర, బాలికల
నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు
కోరుతోంది.
ఆర్‌ఐఎంసి లో ఎనిమిదో తరగతి
ప్రవేశాలు
అర్హత: ఏడో తరగతి చదువుతున్న లేదా
ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
వయసు: 01.01.2023 నాటికి
పదకొడున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి. 02.01.2010-01.07.2011
మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, వైవా
వాయిస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ
ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.600
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి. చిరునామా: ది రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్, దెహ్రాదూన్,
ఉత్తరాఖండ్.
ముఖ్యమై తేదీలు:
దరఖాస్తుకు చివరి తేది: 25.04.2022
పరీక్ష తేది: 04.06.2022.
0 Komentar