Russian invasion of Ukraine-2022: Check These
Pictures
ఉక్రెయిన్ ప్రస్తుత పరిస్థితులను తెలిపే
10 ఫోటోలు ఇవే
వ్లాదిమిర్ పుతిన్ సైనిక చర్యతో ఉక్రెయిన్ ఉలిక్కిపడింది. రాత్రికి రాత్రే ఉక్రెయిన్‌పై క్షిపణులు, బాంబులతో రష్యా విరుచుకుపడింది. రాజధాని కీవ్ సహా కీలక నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. తొలుత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేస్తున్నట్లు ప్రకటించిన రష్యా.. ఆ తర్వాత నివాస సముదాయాలపైనా దాడులకు దిగింది. రష్యా దాడుల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఉక్రెయిన్ పౌరులు బెంబేలెత్తిపోతున్నారు. భీకర శబ్దాల నడుమ ప్రాణాలు కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. కొందరు నగరాలను వీడి ఇతర దేశాల సరిహద్దులకు వెళ్తోంటే.. మరికొందరు అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. కీవ్ వీధుల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు.. క్షిపణుల దాడిలో ధ్వంసమైన భవనాలు.. ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులను అద్దం పడుతున్నాయి.
3. రష్యా దాడిలో మరియుపోల్‌లోని
సైనిక స్థావరం వద్ద ధ్వంసమైన రాడార్ అరేస్, ఇతర సైనిక
పరికరాలు, వాహనాలు.
4. ఉద్రిక్తతల నేపథ్యంలో డబ్బుల కోసం ఏటీఎం వద్ద
ప్రజలు బారులు తీరారు.
5. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో
ఎమర్జెన్సీ ప్రకటించడంతో వాహనాల్లో ఇంధనం నింపేందుకు పెట్రోల్ బంకులకు వాహనదారులు
పోటెత్తారు.
6. వైమానిక దాడులతో భయాందోళనకు గురైన రాజధాని కీవ్
నగర వాసులు ఇతర ప్రాంతాలకు బయల్దేరారు. దీంతో కీవ్ వీధుల్లో కిలోమీటర్ల కొద్దీ
ట్రాఫిక్ నిలిచిపోయిన దృశ్యం.
7. ఖార్కివ్‌లోని చుహివ్
ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌పై రష్యా వైమానిక దాడి జరిపింది. ఈ ఘటనలో
గాయపడిన మహిళ.
8. కీవ్ నగరాన్ని వీడి
వెళ్లేందుకు ఓ మహిళ తన కుమార్తెతో కలిసి రైల్వే స్టేషన్‌లో పడిగాపులు కాస్తోన్న
దృశ్యం.
9. ఉద్రిక్తతల నేపథ్యంలో
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీటి కోసం
స్థానికులు ఇలా ఇబ్బందులు పడుతున్నారు.
10. కీవ్‌పై ప్రయోగించిన
రష్యా షెల్లింగ్ ఒకటి ఇలా భవనాల పక్కన పడిపోయింది.
0 Komentar