SSC CHSL Exam 2021: Notification Released
– Application Details Here
ఎస్ఎస్ సీ-సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్, 2021 – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ) 2021 సంవత్సరానికి గాను
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్
నోటిఫికేషన్ విడుదల చేసింది.
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్ 2021 పోస్టులు:
1) లోయర్ డివిజన్ క్లర్క్
(ఎల్‌డీసీ)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
2) పోస్టల్ అసిస్టెంట్/
సార్టింగ్ అసిస్టెంట్
3) డేటా ఎంట్రీ ఆపరేటర్.
ఖాళీలు: ఖాళీల వివరాలు తర్వాత
వెల్లడిస్తారు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత
సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 01.01.2022 నాటికి 18 -27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు
ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
టెస్ట్ (టైర్ 1, టైర్ 2), స్కిల్ టెస్ట్/ టైపింగ్
టెస్ట్ (టైర్ 3) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: టైర్-1 పరీక్ష
200 మార్కులకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల
రూపంలో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో
ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పు సమాధానానికి 0.50 మార్కు కోత విధిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు ఉంటుంది.
టైర్-2
పరీక్ష (డిస్క్రిప్టివ్ పేపర్): దీన్ని 100 మార్కులకు పెన్
అండ్ పేపర్ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్షా సమయం 60
నిమిషాలు ఉంటుంది. టైర్-1 + టైర్ 2లో
సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని టైర్ - 3 (స్కిల్
టెస్ట్/ టైపింగ్ టెస్ట్)కి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 01.02.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.03.2022.
ఆన్ లైన్లో ఫీజు చెల్లించడానికి
చివరి తేది: 08.03.2022.
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (టైర్-1): 2022, మే.
టైర్ 2 పరీక్ష
(డిస్క్రిప్టివ్ పేపర్): వెల్లడించాల్సి ఉంది.
0 Komentar