TSCAB DCCB Recruitment 2022: Apply for
445 Staff Assistant and Assistant Manager Posts
తెలంగాణ కో-ఆపరేటివ్ అపెక్స్
బ్యాంకుల్లో 445 స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు –
పూర్తి వివరాలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ
స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(టీఎస్ సీఏబీ) ఆధ్వర్యంలో ఉన్న వివిధ
జిల్లాలకు చెందిన కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు(డీసీసీబీ)లు కింది పోస్టుల భర్తీ
కోసం దరఖాస్తులు కోరుతున్నాయి.
మొత్తం ఖాళీలు: 445
జిల్లాల వారీగా ఖాళీలు
1) ఆదిలాబాద్ - 69
2) హైదరాబాద్ - 52
3) కరీంనగర్ - 84
4) మహబూబ్ నగర్ – 32
5) మెదక్ - 72
6) నల్గొండ - 36
7) వరంగల్ - 50
8) ఖమ్మం - 50
పోస్టులు:
స్టాఫ్ అసిస్టెంట్ - 372
అసిస్టెంట్ మేనేజర్ - 73
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం
60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. తెలుగు భాషలో ప్రావిణ్యత
ఉండాలి.
* తెలంగాణ లోకల్ అభ్యర్థులు
మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
* పదో తరగతి/ తత్సమాన
అర్హతతో వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో విద్యను అభ్యసించిన వారిని లోకల్ అభ్యర్థులుగా
పరిగణిస్తారు.
వయసు: 18
నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
*02.02.1992 నుంచి 01.02.2004
మధ్య జన్మించిన వారు అర్హులు.
జీతభత్యాలు:
1) అసిస్టెంట్ మేనేజర్:
నెలకు రూ.26,080 నుంచి రూ.57,860 వరకు
చెల్లిస్తారు.
2) స్టాఫ్ అసిస్టెంట్:
నెలకు రూ.17,900 నుంచి రూ.47,920 వరకు
చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రెండు దశల్లో
ప్రిలిమ్స్, మెయిన్స్ (ఆన్లైన్ ఎగ్జామ్స్) పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్ష ప్రక్రియ:
ప్రిలిమ్స్:
1) ఇంగ్లిష్: 30 ప్రశ్నలు 30 మార్కులు 20నిమిషాలు.
2) రీజనింగ్ అబిలిటీ: 35 ప్రశ్నలు 35 మార్కులు 20నిమిషాలు.
3) క్వాంటిటేటివ్
యాప్టిట్యూడ్/ న్యూమరికల్ ఆబిలిటీ: 35 ప్రశ్నలు 35 మార్కులు 20నిమిషాలు.
మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులు 60నిమిషాలు.
మెయిన్స్:
1) ఎ) జనరల్/ ఫైనాన్షియల్
అవేర్‌నెస్: 30 ప్రశ్నలు 30 మార్కులు20 నిమిషాలు. బి) అవేర్ నెస్ ఆన్ క్రెడిట్
కోఆపరేటివ్స్ 10 ప్రశ్నలు 10 మార్కులు.
2) ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్: 40 ప్రశ్నలు 40 మార్కులు 30
నిమిషాలు 3) రీజనింగ్ అబిలిటీ: 40
ప్రశ్నలు 40 మార్కులు 35 నిమిషాలు.
4) క్వాంటిటేటివ్
యాప్టిట్యూడ్/ న్యూమరికల్ అబిలిటీ: 40 ప్రశ్నలు 40 మార్కులు 35 నిమిషాలు.
మొత్తం: 180 ప్రశ్నలు 160 మార్కులు 120
నిమిషాలు
నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి
తప్పు ప్రశ్నకు 0.25 మార్కు తొలగిస్తారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్,
ఖమ్మం , మహబూబ్ నగర్, నల్గొండ,
నిజామాబాద్, వరంగల్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: జనరల్/ బీసీ అభ్యర్థులు రూ.900,
ఎస్సీ/ఎస్టీ/పీసీ అభ్యర్థులు రూ.250
చెల్లించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.02.2022.
దరఖాస్తులకు చివరి తేది: 06.03.2022, 10.03.2022
0 Komentar