Union Budget 2022-23: Things That Got Costlier and Cheaper
కేంద్ర బడ్జెట్ 2022-23: బడ్జెట్ తర్వాత ఏ వస్తువులపై ధరలు పెరగున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
2022-23 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టారు. ఎప్పటిలాగే ఈసారి కూడా పలు వస్తువులపై సుంకాల తగ్గింపు, పెంపు చేపట్టారు. కట్, పాలిష్డ్ వజ్రాలపై సుంకాన్ని 7.5శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. మొబైల్ ఫోన్లలో వాడే కెమెరా లెన్స్‌లపై డ్యూటీని తగ్గించారు. ఇక కొన్ని దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను పెంచారు. దీంతో ఆయా వస్తువుల ధరల్లో మార్పులు జరగనున్నాయి. మరి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయి.. వేటి ధరలు పెరగనున్నాయి.
===============
ధరలు తగ్గేవి ఇవే..
* దుస్తులు
* రంగు రాళ్లు, వజ్రాలు
* మొబైల్ ఫోన్లు
* మొబైల్ ఫోన్ ఛార్జర్లు
* పెట్రోలియం ఉత్పత్తులకు
అవసరమయ్యే కొన్ని రకాల రసాయనాలు
* శీతలీకరించిన నత్తగుల్లలు
* ఇంగువ, కాఫీ గింజలు
===============
వీటి ధరలు పెరుగుతాయ్..
* గొడుగులు
* ఇమిటేషన్ నగలు
* లౌడ్ స్పీకర్లు
* హెడ్‌ఫోన్లు, ఇయర్ ఫోన్లు
* స్మార్ట్ మీటర్లు
* సోలార్ సెల్స్
* ఎక్స్‌రే మిషన్లు
* ఎలక్ట్రిక్ బొమ్మల భాగాలు
===============
ఇదిలా ఉండగా.. పెట్రోల్, డీజిల్
ఉత్పత్తిలో బ్లెండెడ్ బయోఫ్యుయల్ వాడకాన్ని పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం
తీసుకుంది. అన్‌బ్లెండెడ్ ఫ్యుయల్‌పై లీటర్‌కు రూ.2 చొప్పున
అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించనున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో
ప్రకటించారు. అయితే దీన్ని 2022 అక్టోబరు నుంచి అమల్లోకి
తీసుకురానున్నట్లు వెల్లడించారు.
కేంద్ర
బడ్జెట్ 2022-23 ముఖ్యాంశాలు ఇవే
కేంద్ర బడ్జెట్ 2022-23: స్కూల్ విద్యార్థుల కోసం వన్ క్లాస్ - వన్ టీవీ ఛానల్
0 Komentar