US Waives In-Person Interview
Requirements for Many VISA Applicants in India Till Dec 31
అమెరికా వీసా దరఖాస్తుదారులకు శుభవార్త - వ్యక్తిగత ఇంటర్వ్యూలు రద్దు - వివరాలు ఇవే
యూఎస్ వీసా దరఖాస్తుదారులకు శుభవార్త. కొన్ని రకాల వీసాలకు వ్యక్తిగత ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా తెలిపింది. విద్యార్థి, వృత్తి, కళాకారులకు సంబంధించిన వివిధ రకాల వీసా దరఖాస్తుదారులకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ మినహాయంపు ఇస్తున్నట్లు అమెరికాకు చెందిన ఓ సీనియర్ అధికారి భారత సంతతి ప్రతినిధులకు తెలిపారు. విద్యార్థులు (F, M, J), వృత్తి నిపుణులు (H-1, H-2, H-3, L వీసాలు), కళాకారులు, విశిష్ట ప్రతిభావంతులు (O, P, Q)కు ఇచ్చే వీసా దరఖాస్తులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది.
ఇంటర్వ్యూ రద్దు వల్ల చాలా మంది
వీసా దరఖాస్తుదారులకు మేలు చేకూరనుందని దక్షిణాసియా కమ్యూనిటీ లీడర్ అజయ్ జైన్
భుటోరియా తెలిపారు. దీనివల్ల చాలా మందికి ఉన్న అడ్డంకులు, అవరోధాలు
తొలగిపోతాయయని చెప్పారు. ఈయన ఏషియన్ అమెరికన్లకు సంబంధించిన అంశాల్లో అమెరికా
అధ్యక్షుడు జో బైడెన్‌కు సలహాదారుడిగానూ వ్యవహరిస్తున్నారు. ఇటీవల దక్షిణ మధ్య
ఆసియా అసిస్టెంట్ సెక్రటరీ డోనల్ లూతో జరిగిన భేటీ అనంతరం ఈ విషయాన్ని
వెల్లడించారు. డిసెంబర్ 31 వరకు ఇంటర్వ్యూలు రద్దు
చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నట్లు భుటోరియా వెల్లడించారు.
అయితే, ఈ ఇంటర్వ్యూ రద్దు ప్రోగ్రామ్
కింద లబ్ధి పొందాలంటే గతంలో ఏదైనా అమెరికన్ వీసా ప్రోగ్రామ్ కింద వీసా పొంది
ఉండాలి. వీసా గతంలో తిరస్కరణకు గురైన వారు, తగిన అర్హత
లేనివారు ఇంటర్వ్యూ మినహాంయపు పొందలేరు. అమెరికాలో ఏ వీసా జారీకైనా వ్యక్తిగత
ఇంటర్వ్యూ తప్పనిసరి. అందులో ఎంపికైతేనే వీసా మంజూరవుతుంది. అయితే, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇంటర్వ్యూల నుంచి అగ్రరాజ్యం మినహాయింపు
ఇస్తోంది.
0 Komentar