Odisha villagers make sarpanch
candidates write a test before actual polls
సర్పంచి అభ్యర్థులకు ఎన్నికలకు
ముందు రాత పరీక్ష పెట్టిన గ్రామస్థులు - వివరాలు ఇవే
ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా
కుత్రా పంచాయతీ మలుపడ గ్రామంలో సర్పంచి అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించిన ఘటన
చర్చనీయాంశమైంది. కుత్రా పంచాయతీ తరఫున సర్పంచి పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులను
మలుపడ గ్రామస్థులు శనివారం సమావేశ పరిచారు. తాము పెట్టే రాత పరీక్షలో ఉత్తీర్ణులైన
వారికి ఓట్లేస్తామని చెప్పడంతో 8 మంది రాత పరీక్షకు సిద్ధమయ్యారు. 7 ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రం వారికి అందజేశారు.
గడిచిన ఐదేళ్ల కాలంలో మీరు చేసిన
సమాజ సేవలు ఏమిటి?, మీరు గెలిస్తే రానున్న ఐదేళ్లలో చేసే
అభివృద్ధి పనులేంటి?, ఇప్పుడు ఇంటింటికీ వచ్చి ఓట్లు
అడుగుతున్నారు. గెలిచిన తర్వాత యోగక్షేమాలు తెలుసుకునేందుకు వస్తారా? వంటి ప్రశ్నలు అందులో ఉన్నాయి. ఈ రాత పరీక్షలో ముగ్గురు ఉత్తీర్ణులు కాగా,
ఐదుగురు ఫెయిలైనట్లు గ్రామస్థులు ప్రకటించారు. ఈ ముగ్గురిలో
గ్రామస్థులు ఎవరికి ఓటు వేయనున్నారన్న ఆసక్తి చుట్టుపక్కల గ్రామాల్లో నెలకొంది.
0 Komentar