What is incognito mode? Know the Browsing
Details in Incognito Mode
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లోని ‘ఇన్‌కాగ్నిటో
మోడ్’ గురించి ఈ విషయాలు తెలుసా?
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ సెర్చ్
ఇంజిన్‌లో మనం వెతికే సమాచారం లోకల్ డ్రైవ్‌లో నిక్షిప్తమై ప్రతీది హిస్టరీ
పేజీలో కనిపిస్తోంది. మనం ఏ వెబ్‌సైట్‌లో ఏం సెర్చ్ చేశామో ఆ హిస్టరీలోకెళ్లి
వెతికితే ఇట్టే తెలిసిపోతుంది. అయితే, కొందరు తమ వ్యక్తిగత బ్రౌజింగ్‌ను
ఇతరులు చూడకుండా ఉండటం కోసం ఎప్పటికప్పుడు హిస్టరీని క్లీన్ చేస్తూ పోతుంటారు.
ఇది చాలా సందర్భాల్లో వీలుకాకపోవచ్చు. అందుకోసం క్రోమ్ బ్రౌజర్‌లో ‘ఇన్‌కాగ్నిటో
మోడ్’ అందుబాటులో ఉంది. దీనిలో ఏం సెర్చ్ చేసినా బ్రౌజింగ్ హిస్టరీలో
కనిపించదు. మరి ఇది ఎలా పనిచేస్తుంది? దాని వివరాలేంటో
తెలుసుకుందామా..
‘ఇన్‌కాగ్నిటో మోడ్’
అంటే..
ఇన్‌కాగ్నిటో అంటే తెలుగులో
అజ్ఞాతం లేదా పేరు, హోదా తెలియని అని అర్థం. మనం వాడే స్మార్ట్‌ఫోన్,
ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ వంటి పరికరాలలో ఇంటర్నెట్‌లో మనం వెతికే సమాచారం
ఇతరులకు తెలియకుండా ఉండటం కోసం ‘ఇన్‌కాగ్నిటో మోడ్’ ఉపయోగపడుతోంది. ఇది మన
వ్యక్తిగత బ్రౌజింగ్ విషయాలను గోప్యంగా ఉంచడానికి సహాయపడుతోంది.
ఎందుకోసం వాడతారు..?
మనం ఇంటర్నెట్‌లో వెతికిన సమాచారం
హిస్టరీలో కనిపించకుండా ఉండటానికి దీన్ని ఉపయోగిస్తుంటారు. ఒకవేళ ఎవరైనా మన డివైస్‌ను
వాడినపుడు హిస్టరీలో మనం దేని గురించి వెతికామో.. ఏ వెబ్‌సైట్స్ ఎక్కువ
ఉపయోగించామో తెలిసిపోతుంది. రహస్య శోధన కోసం దీన్ని ఎక్కువగా వాడుతుంటారు.
ఏవిధంగా టర్న్ ఆన్ చేయాలి..
క్రోమ్ బ్రౌజర్‌లో ఈ మోడ్ ఉందో
లేదో ముందుగా చెక్ చేసుకోవాలంటే అడ్రస్ బార్ పక్కన ఉన్న మూడు డాట్ బటన్‌పై
క్లిక్ చేయాలి. తర్వాత మెనూ ఓపెన్ అవుతోంది. అందులో ‘న్యూ ఇన్‌కాగ్నిటో ట్యాబ్’
అనే ఆప్షన్ కనిపిస్తోంది. ఈ మోడ్‌లోకి ఎంటర్ అవ్వగానే దీని పనితీరు వివరిస్తూ ఒక
సందేశాత్మక నోటిఫికేషన్ వస్తోంది. అంతే దీంతో ‘ఇన్‌కాగ్నిటో మోడ్’ టర్న్ ఆన్
అయిపోయినట్లే.
ఇవి గుర్తుంచుకోవాలి..
క్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగించి మనం
చేసిన డౌన్‌లోడ్స్, బుక్‌మార్క్‌లు ఇతరత్రా అంశాలు సేవ్
అవుతాయి. కానీ, ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఏం చేసినా, ఏం చూసినా హిస్టరీలో సేవ్ అవ్వవు. కానీ, మనం చూసే
వెబ్‌సైట్లు, మనకు ఇంటర్నెట్ సేవలు కల్పిస్తున్న సర్వీస్
ప్రొవైడర్లు, పనిచేసేచోట కంప్యూటర్లయితే కంపెనీ యాజమాన్యాలు,
పాఠశాలలో కంప్యూటర్లయితే పాఠశాల యాజమాన్యాలు మాత్రం మనల్ని ట్రాక్
చేయగలవని గుర్తుంచుకోవాలి. అక్కడ ఉండే సర్వర్లలో మన బ్రౌజింగ్ హిస్టరీ
నిక్షిప్తమవుతుందని తెలుసుకోవాలి. గూగుల్, ఫేస్‌బుక్‌తో
పాటు చాలా వెబ్‌సైట్లు ఇన్‌కాగ్నిటో మోడ్‌ను
ఉపయోగించి ఇంటర్నెట్‌లో వినియోగదారుడు చేస్తున్న పనుల్ని ట్రాక్
చేస్తున్నాయని గతంలోనే పలు అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి ఇటువంటి విషయాలను
తప్పక గుర్తుంచుకొని ‘ఇన్‌కాగ్నిటో మోడ్’ను వినియోగించుకొండి.
0 Komentar